థియేటర్లు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు..

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 04:08 PM IST
థియేటర్లు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు..

SOP for Exhibition of films in theatres: అన్‌లాక్‌ 5.0 లో కేంద్ర ప్రభుత్వం సినిమా రంగానికి థియేటర్స్‌ విషయంలో ఓ క్లారిటీనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సినిమా థియేటర్స్ పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి మరింత క్లారిటీ ఇస్తూ ప్రకటనను విడుదల చేశారు. ఆరేడు నెలల తర్వాత థియేటర్స్‌ ఓపెన్‌ అవుతున్న నేపథ్యంలో ప్రతి షోకు (సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్) థియేటర్‌ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..



1. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ను రన్‌ చేయాలి.
2. సీట్లను కేటాయించేటప్పుడు భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి.
3. మార్క్‌ చేసిన సీట్లో కూర్చోకుండా చూడాలి.
4. చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్స్‌ను ఏర్పాటు చేయాలి.
5. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని సూచించాలి.
6. థెర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేనివారినే థియేటర్‌లోకి పంపాలి
7. ఆరోగ్య సమస్యలపై మానిటరేట్‌ చేయాలి.
8. వేర్వేరు స్క్రీన్స్‌లో వేర్వేరు టైమింగ్స్‌ ఉండేలా చూసుకోవాలి(మల్టీప్లెక్స్‌ల్లో).


9. టికెట్‌ పేమెంట్‌ను డిజిటల్‌ పద్ధతిలో తీసుకోవాలి.
10. థియేటర్స్‌, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
11. తగినన్ని కౌంటర్స్‌ ఉండేలా చూసుకోవాలి.
12. విరామ సమయంలో ప్రేక్షకులు గుంపులు గుంపులుగా రాకుండా చూసుకోవాలి.
13. థియేటర్‌ సిబ్బంది కూడా భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి.
14. బాక్సాఫీస్‌ వద్ద టికెట్స్‌‌ను రోజంతా ప్రేక్షకులకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
15. ఉమ్మివేయడం నిషేధం.
16. గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి.


17. ప్యాకెడ్‌ ఫుడ్‌ను మాత్రం అందించాలి. థియేటర్ లోపల ఫుడ్‌ను అందించకూడదు.
18. ఫుడ్‌ ఇతర తినుబండారాలకు సంబంధించి ఎక్కువ కౌంటర్స్‌ ఉండేలా చూసుకోవాలి.
19. థియేటర్‌ సిబ్బంది కూడా బూట్లు, గ్లవ్స్‌, మాస్కులు, పీపీఈ కిట్స్‌ వేసుకుని శానిటైజ్‌ చేసుకోవాలి.
20. ప్రేక్షకుల కాంటాక్స్‌ నెంబర్‌ తప్పకుండా తీసుకోవాలి.
21. ఎక్కువ సంఖ్యలో కౌంటర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
22. కోవిడ్‌ నిబంధనలను పాటించని చర్యలను కఠినంగా నిరోధించాలి.
23. థియేటర్స్‌లోని ఏసీల టెంపరేచర్‌ 24-30 మధ్య ఉండేలా చూసుకోవాలి.
24. షో ప్రారంభమయ్యే ముందు, ఇంటర్వెల్‌, షో చివరలో కోవిడ్ నిబంధనలను అనౌన్స్‌మెంట్‌గా ఇవ్వాలి.