Most Eligible Bachelor: బ్యాచిలర్ నుండి సోల్ ఫుల్ సాంగ్.. చిట్టి అడుగు వచ్చేసింది!

చాలా కాలంగా కెరీర్‌లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రంలో అఖిల్..

Most Eligible Bachelor: బ్యాచిలర్ నుండి సోల్ ఫుల్ సాంగ్.. చిట్టి అడుగు వచ్చేసింది!

Most Eligible Bachelor

Most Eligible Bachelor: చాలా కాలంగా కెరీర్‌లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 15వ తేదీన థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్ వరసపెట్టి లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తుంది.

MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’లో ఎందుకింత వైరాగ్యం

బ్యాచిలర్ నుండి లెహరాయి, గుచ్చే గులాబీ ముళ్ళు సినిమా మీద హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు మరో సోల్ ఫుల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సినిమా నుండి ‘చిట్టి అడుగు’ లిరికల్ సాంగ్ విడుదల అయింది. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకి లిరిక్స్ రాయగా, జియా ఉల్ హక్ పాడటం జరిగింది. ఇప్పటికే ఈ ఆల్బమ్ మ్యూజికల్ హిట్ కావడం గ్యారంటీ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు వచ్చిన ఈ పాట కూడా మరింత కాన్ఫిడెంట్ పెంచుతుంది.

Vikramarkudu 2: దర్శకుడే కాదు హీరో కూడా మార్పు తప్పదా?

మరో నాలుగు రోజులలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ పాట విడుదల చేయగా మరోవైపు యూనిట్ ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన రాగా ముఖ్యంగా ‘లెహరాయి’ సాంగ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్‌ హర్షగా, పూజా హెగ్డే విభా అనే పాత్రలో నటిస్తున్నారు. మరి హర్ష అఖిల్ ఎంతవరకు కలిసి వస్తాడో ఈనెల 15 వరకు ఆగితే కానీ తెలియదు.