Sourav Ganguly : తెరపైకి మరో కెప్టెన్ బయోపిక్.. హీరో అతనేనా?

భారత దిగ్గజ క్రికెటర్, ఒకప్పటి కెప్టెన్ మరియు బిసిసిఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసిన మేకర్స్ తాజాగా ఈ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజికి వచ్చింది అని తెలియజేశారు. కాగా ఈ బయోపిక్ లో నటించేది..

Sourav Ganguly : తెరపైకి మరో కెప్టెన్ బయోపిక్.. హీరో అతనేనా?

Sourav Ganguly biopic

Sourav Ganguly : భారత దిగ్గజ క్రికెటర్, ఒకప్పటి కెప్టెన్ మరియు బిసిసిఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసిన మేకర్స్ తాజాగా ఈ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజికి వచ్చింది అని తెలియజేశారు. తన అగ్రెస్సివ్‌నెస్ తో భారత క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని రాసుకున్న గంగూలీ.. అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ అఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా పిలిపించుకున్నాడు. ఇప్పుడు గంగూలీ బయోపిక్ వస్తుంది అంటే అందరిలో ఆసక్తి నెలకుంది. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ బయోపిక్ తీయడం కోసం కాన్సెప్ట్‌తో తనను సంప్రదించినట్లు గంగూలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో సౌరవ్ గంగూలీ భేటీ.. రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడా?

అయితే ఈ బయోపిక్ స్క్రిప్ట్‌ను తానే స్వయంగా రచిస్తున్నాడు గంగూలీ. ఈ స్క్రిప్ట్ దాదాపు పూర్తీ కావొచ్చింది అంటా. తాజాగా సినిమా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ గురించి మాట్లాడేందుకు గంగూలీ నిన్న ముంబై చేరుకున్నాడు. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ చాలా లేటు అవుతూ వచ్చింది. త్వరలోనే పూర్తీ చేసి చిత్రీకరణ దశకి తీసుకు వెళ్ళబోతున్నట్లు వెల్లడించాడు గంగూలీ. కాగా ఈ బయోపిక్ లో నటించేది ఆ హీరోనే అని పలువురు బాలీవుడ్ హీరోల పేరులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా పేరులు తెరపైకి వచ్చాయి. దీని గురించి గంగూలీని ప్రశ్నించగా.. ఇంకా హీరో ఎవరన్నది నిర్ణయించుకోలా అంటూ బదులిచ్చాడు.

కాగా ఈ బయోపిక్ లో రణబీర్ కపూర్ నటించబోతున్నాడు అంటూ బాలీవుడ్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ హీరో సంజయ్ దత్త్ బయోపిక్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీజిత్ ముఖర్జీ గతంలో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ ‘మిథాలి రాజ్’ బయోపిక్ ని ‘శభాష్ మిథు’ పేరుతో తెరకెక్కించాడు.