Bholaa : ఖైదీ బాలీవుడ్ రీమేక్ భోళా.. రిలీజ్ అవ్వకముందే విమర్శలు..

ఖైదీ సినిమాని బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా భోళా పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత కూడా అజయ్ దేవగణ్ కావడం విశేషం. ఇటీవల బాలీవుడ్ వాళ్ళు సౌత్ లో హిట్ అయిన సినిమాలను తీసుకొని అక్కడ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీమేక్ సినిమాలని...............

Bholaa : ఖైదీ బాలీవుడ్ రీమేక్ భోళా.. రిలీజ్ అవ్వకముందే విమర్శలు..

South Audience firing on Bholaa movie unit for changing story completely

Bholaa :  కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖైదీ. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఒక్క రాత్రిలో జరిగే కథతో చాలా ఆసక్తికరంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఖైదీ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమా చాలా కొత్తగా అనిపించింది. ఖైదీ సినిమాని బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా భోళా పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత కూడా అజయ్ దేవగణ్ కావడం విశేషం. ఇటీవల బాలీవుడ్ వాళ్ళు సౌత్ లో హిట్ అయిన సినిమాలను తీసుకొని అక్కడ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీమేక్ సినిమాలని ఉన్నది ఉన్నట్టుగా తీయకుండా, లేదా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు సింపుల్ గా మార్పులు చేసి తీయకుండా బాలీవుడ్ వాళ్ళు ఇక్కడి కథలో వాళ్ళ సొంతప్రయోగాలు చేస్తుండటంతో ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ అక్కడ ఫ్లాప్స్ అవుతూనే ఉన్నాయి.

ఈ విషయంలో సౌత్ ప్రేక్షకులు బాలీవుడ్ మీద ఫైర్ అవుతున్నారు. తాజాగా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా అలవైకుంఠపురంలో హిందీలో కార్తీక్ ఆర్యన్ తో షెహజాదాగా రీమేక్ చేశారు. ఈ సినిమాలో కూడా చాలా పాయింట్స్ మార్చడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఇలా సౌత్ సినిమా కథలని తీసుకొని వాళ్లకు తగ్గట్టుగా ఇష్టమొచ్చిన మార్పులు చేసి సినిమా ఒరిజినాలిటీని పోగొడుతున్నారు. తాజాగా భోళా సినిమాలో కూడా అదే చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సౌత్ ప్రేక్షకులు, ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు భోళా సినిమా చిత్రయూనిట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఒరిజినల్ ఖైదీ సినిమాలో అసలు హీరోయిన్, సాంగ్స్ ఏమి ఉండవు, లేడి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉండరు. కానీ హిందీ భోళా సినిమాలో లేడీ పోలీసాఫీసర్ గా టబు నటిస్తుంది అని తెలిసినప్పుడే వీళ్ళు కథని మార్చేస్తున్నారు అని అర్థమైంది. ఇక సినిమాలో హీరోయిన్ గా అమలాపాల్ నటిస్తుంది అని తెలిసాక అసలు సినిమాలో హీరోయిన్ ఎక్కడ ఉందిరా అనుకున్నారు అంతా. ఇప్పుడు ఏకంగా హీరో, హీరోయిన్ మధ్య నజర్ లాగ్ జయేగి అంటూ ఓ పాటని కూడా రిలీజ్ చేయడంతో తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు.

Shahrukh Khan : మీరు చదివిందంతా అబద్దం.. నేను అస్సలు రిటైర్ అవ్వను.. షారుఖ్ వ్యాఖ్యలు..

ఖైదీ సినిమా అంతా ఒక్క రాత్రిలో యాక్షన్, సస్పెన్స్ సీన్స్ తో అయిపోతుంది. వీళ్ళు భోళా సినిమాలో లేడీ పోలీసాఫీసర్, హీరోయిన్, హీరోయిన్ తో రొమాన్స్, మార్నింగ్ సీన్స్.. ఇలా ఇష్టమొచ్చినట్టు కథని నాశనం చేస్తున్నారు, ఈ రీమేక్ కూడా ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారు తమిళ ప్రేక్షకులు. ఇక కొంతమంది మా సౌత్ సినిమాలని నాశనం చేస్తున్నారని సోషల్ మీడియాలో భోళా టీంపై ఫైర్ అవుతున్నారు. సినిమా రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో విమర్శలు వస్తే మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకే రేంజ్ లో విమర్శలు వస్తాయో చూడాలి. బాలీవుడ్ వాళ్ళు ఈ ఖైదీ రీమేక్ ని ఎలా చూపించబోతున్నారో.