South Directors : క్రేజ్ పెంచుకొని తమ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్న సౌత్ డైరెక్టర్లు..

సినిమా అంటే ఒకప్పుడు హీరో, హీరోయిన్ మాత్రమే. సినిమా ఆడేదీ లేనిదీ, అంచనాలు క్రియేట్ అయ్యేదీ లేనిదీ డిపెండ్ అయ్యేది హీరో మీదే. హీరోల డేట్స్ కోసమే అందరూ ఎదురుచూసేవాళ్లు. అలాంటి పరిస్థితిని తిరగరాసి హీరోల్నే తమ వెంట తిప్పుకుంటున్నారు ఈ డైరెక్టర్లు. ఇప్పుడు ఈ డైరెక్టర్లు సినిమా....................

South Directors : క్రేజ్ పెంచుకొని తమ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్న సౌత్ డైరెక్టర్లు..

South Directors :  సినిమా అంటే ఒకప్పుడు హీరో, హీరోయిన్ మాత్రమే. సినిమా ఆడేదీ లేనిదీ, అంచనాలు క్రియేట్ అయ్యేదీ లేనిదీ డిపెండ్ అయ్యేది హీరో మీదే. హీరోల డేట్స్ కోసమే అందరూ ఎదురుచూసేవాళ్లు. అలాంటి పరిస్థితిని తిరగరాసి హీరోల్నే తమ వెంట తిప్పుకుంటున్నారు ఈ డైరెక్టర్లు. ఇప్పుడు ఈ డైరెక్టర్లు సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా క్రేజ్, రేంజ్ రెండూ పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ హీరోలు కూడా ఈ డైరెక్టర్ల కోసం క్యూ కడుతున్నారంటే, ఈ సౌత్ డైరెక్టర్ల స్టామినా ఏంటో అర్దం చేస్కోవచ్చు. అలా పాన్ ఇండియా వైడే కాదు, పాన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సౌత్ సత్తా చూపిస్తున్నారు ఈ డైరెక్టర్స్.

సౌత్ స్థాయిని గ్లోబల్ వైడ్ గా తీసుకెళ్లిన డైరెక్టర్ అన్ డౌటెడ్ లీ రాజమౌళి. ఇప్పటి వరకూ అంతర్జాతీయ అవార్డుల్ని పెద్దగా గెలుచుకోని తెలుగు సినిమాకి ప్రెస్టీజియస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తీసుకొచ్చి సౌత్ సినిమా స్థాయిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు రాజమౌళి. బాహుబలికి ముందు తెలుగు సినిమా అంటే జస్ట్ రీజనల్ సినిమాగా ఉండేది. తెలుగు సినిమాను వరల్డ్ వైడ్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ను ఒకేసారి వేల కోట్లకు పెంచేశారు రాజమౌళి. రాజమౌళి జస్ట్ డైరెక్టర్ కాదు. తెలుగు సినిమా బ్రాండ్. తెలుగు సినిమాలకు ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమా పరిధిని ఒకేసారి వరల్డ్ వైడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలితో 2 వేలకోట్లు కొల్లగొట్టాడు. ట్రిపుల్ ఆర్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో 1200కోట్ల కలెక్షన్లు రాబట్టారు. అదే రేంజ్ లో ఇంటర్నేషనల్ అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ట్రిపుల్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో రాజమౌళి నెక్స్ట్ మహేష్ సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకూ ఇండియన్ హిస్టరీ లోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని మహేష్ తో చెయ్యబోతున్నారు రాజమౌళి. ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ ఇమేజ్, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇండియానా జోన్స్ రాబిన్ హుడ్ స్టైల్లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ స్టైల్ స్టోరీని రెడీ చేస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో భారీ సినిమాగా తెరకెక్కబోతోంది ఈ సినిమా.

ఒక్క డైలాగ్ తో ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ని సొంతం చేసుకున్నారు సుకుమార్. సౌత్ సత్తాని పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తీసుకొచ్చి అదే రేంజ్ లో కంటెంట్ ఇస్తున్న సుకుమార్ పుష్పతో క్రియేట్ చేసిన మానియా అంతా ఇంతా కాదు. రీజనల్ సినిమాని పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి కనెక్ట్ చేసి 400 కోట్లు కొల్లగొట్టారు సుకుమార్ . బన్నీని నెవర్ బిఫోర్ లుక్ లో చూపించి స్టైలిష్ స్టార్ ని మాస్ హీరోగా, డీగ్లామర్ లుక్ తో కూడా అదిరిపోయేలా చేశారు సుకుమార్. క్లాసీమేకింగ్ తో పాటు క్వాలిటీ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన సుకుమార్ 2021లో రిలీజ్ చేసిన పుష్ప సినిమాతో ఓ రేంజ్ కి వెళ్లిపోయారు. వరల్డ్ వైడ్ గా హంగామా చేసిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ షూటింగ్ లోఉంటుంది. 400కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ స్కేల్ లో బన్నీ హీరోయిజం చూపించబోతున్నారో, ఎలాంటి ట్విస్టులతో రాబోతోందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా జనాలు.

క్వాలిటీ మూవీ మేకింగ్ తో తెలుగు సినిమాని ఎలివేట్ చేస్తూ సౌత్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్న సూపర్ స్టార్ డైరెక్టర్లలో నాగశ్విన్ కూడా ఒకరు. హీరో అంటే సోకాల్డ్ హీరోయిజం చూపించాలి, ఫైట్స్ చెయ్యాలి లాంటి రొటీన్ రూల్స్ లేకుండా జస్ట్ కథను మాత్రమే హీరోగా చూపిస్తూ కొత్త పాత్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నాగశ్విన్. చేసింది2 సినిమాలే అయినా తన మేకింగ్ తో, క్రియేటివిటీతో స్టార్ డైరెక్టర్ల స్థాయికి వెళ్లిపోయారు నాగశ్విన్. మహానటి సావిత్రి కాంట్రవర్షియల్ లైఫ్ జర్నీని అన్ ఇమాజినబుల్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని కన్విన్స్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు నాగశ్విన్. ఇప్పుడు అదే సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ నెక్ట్స్ లెవల్ సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకూ రాజమౌళి పాన్ ఇండియా అన్న పదం వాడితే ప్రాజెక్ట్ K తో దాన్ని పాన్ వరల్డ్ చేశారు నాగశ్విన్. ప్రాజెక్ట్ K.. ప్రభాస్ గ్రాండియర్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చూపించబోతున్న సినిమా. ఇప్పటి వరకూ వచ్చిన ప్రభాస్ సినిమాల్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లబోతున్న సినిమా. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ అండ్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ దీపికా పదుకోనే, ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఇండియన్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. దీనికి తోడు ప్రాజెక్ట్ Kలో హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. సినిమాలో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ నుంచి 5గురు స్టంట్ డైరెక్టర్స్ ని హైర్ చేసుకున్నారు టీమ్. 500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K అసలు గ్రాండియర్ కి అర్దం చెబుతూ, ప్రభాస్ ని నెక్ట్స్ లెవల్ లో చూపించబోతోంది.

ఒక్క సినిమా.. KGF అనే ఒకే ఒక్క సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. సౌత్ లో చిన్న సినమా ఇండస్ట్రీ అయిన కన్నడ నుంచి KGF అనే పెద్ద సినిమా చేసి 550 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ప్రశాంత్ నీల్. KGF కంటే ముందు ప్రశాంత్ జస్ట్ ఉగ్రమ్ అనే ఒకే ఒక్క చిన్న సినిమా చేశారు. ఆ తర్వాత చేసిన KGF తో హిస్టరీ క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క సినిమాతో ప్రశాంత్ ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా అవతరించడమే కాదు, వరస పెట్టి స్టార్ హీరోలతో సినిమా చాన్సులు కూడా దక్కించుకుంటున్నారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో అంతకంటే గ్రాండ్ విజువల్స్ తో భారీ తెరకెక్కిన కెజిఎఫ్ 2 అంతకుమించి రికార్డుల్ని క్రియేట్ చేసింది. 100కోట్ల బడ్జెట్ కి 1200కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా సర్ ప్రైజ్ అయ్యేలా చేసింది. అంతేకాదు ఆ రేంజ్ మేకింగ్ తో, ఎలివేషన్ తో సౌత్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు ప్రశాంత్ నీల్. ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా మీదే అందరి ఫోకస్ ఉంది. నెవర్ బిఫోర్ మేకింగ్ తో అంతకముందు సినిమాలకంటే గ్రాండ్ గా సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే పోస్టర్లతోనే హైప్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో అంటూ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కూడా భారీ సినిమా కమిట్ అయ్యారు ప్రశాంత్ నీల్.

ఇప్పటి వరకూ కన్నడ జనానికి తప్ప సౌత్ లోనే పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఇప్పుడు ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాకి పరిచయం అయ్యారు. పరిచయం అంటే అలా ఇలా కాదు, విషయం ఉన్న డైరెక్టర్ గా, 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న హీరోగా పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ అయ్యారు రిషబ్ శెట్టి. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి.. 5ఏళ్ల యాక్టింగ్ కెరీర్, 5 ఏళ్ల డైరెక్టర్ కెరీర్. ఇన్ని సంవత్సరాల్లో చెయ్యలేనిది ఒక్క సినిమా రిషబ్ ని రాత్రికి రాత్రి స్టార్ ని చేసింది. డైరెక్టర్ గా, హీరోగా డబుల్ రోల్ చేసిన రిషబ్ శెట్టి పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కాంతారాతో సత్తాచాటి సౌత్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు. రీజనల్ సినిమా అయిన కాంతారా సౌత్ కి కనెక్ట్ అయ్యిందంటే ఓకే కానీ సినిమాలోని ఇంటెన్సిటీతో బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని అక్కడ 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు కాంతారా క్రేజ్ తో రిషబ్ కి బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ రేంజ్ లో కన్నడ సినిమాని ఇండియా వైడ్ గా సూపర్ సెన్సేషన్ చేసిన రిషబ్ శెట్టి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చెయ్యబోతున్నాడో అని ఇండియా వైడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో ఇండియన్ సినిమాకే సినిమాటిక్ యూనివర్స్ ని తెరమీదకి తీసుకొచ్చి సౌత్ సినిమా రేంజ్ ని పెంచిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకేష్ కనగరాజ్ ప్రజెంట్ తమిళ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లుకొడుతున్న ఈ యంగ్ డైరెక్టర్ లేటెస్ట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూర్య, కార్తి, విజయ్ సేతుపతి, కమల్ హాసన్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి తెరతీశారు. 400కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ కొట్టింది విక్రమ్ మూవీ. ఈ సినిమా కంటే ముందే లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని గట్టిగా ఆడియన్స్ కి చూపించిన మూవీ ఖైదీ. కార్తి లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాతో అందరి కాన్సన్ ట్రేషన్ గ్రాబ్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ యంగ్ డైరెక్టర్ టేకింగ్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇదే సినిమాని బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ భోలా గా రీమేక్ చేస్తున్నారు. ఖైదీ తర్వా వచ్చిన మాస్టర్, విక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఉన్న లోకేష్ ప్రస్తుతం విజయ్ సినిమాతో పాటు ఖైదీ 2తో అంచనాలు పెంచేస్తున్నారు.

Netflix : మొన్న తెలుగు.. ఇప్పుడు తమిళ్.. వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్

కంటెంట్ వైజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నా, కమర్షియల్ గా పెద్ద నంబర్స్ సాధించని మలయాళ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్న డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ డైరెక్టర్ చేసిన దృశ్యం మూవీ సౌత్ నుంచి బాలీవుడ్ వరకూ అన్నిచోట్లా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ క్రియేట్ చేస్తోంది. మళయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2కి రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ని ట్రాక్ లో పడెయ్యడంలో హెల్ప్ అయ్యింది. అజయ్ దేవ్ గన్ లీడ్ రోల్ చేసిన దృశ్యం 2 సినిమా 240కోట్ల కు పైగా కలెక్ట్ చేసి కంటెంట్ తోనే ఆడియన్స్ ని పడగొట్టింది. అందుకే నెక్ట్స్ జీతూ ఏం సినిమా చేస్తున్నారో, ఎలాంటి ఇంట్రస్టింగ్ స్టోరీని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇలా సౌత్ డైరెక్టర్లు సౌత్ సినిమానే కాదు ఇండియన్ సినిమానే నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతూ సెన్సేషన్ అవుతూ తమ నెక్స్ట్ సినిమాలపై అంచనాలని క్రియేట్ చేస్తున్నారు.