South Heroins: అప్నా టైమ్ ఆయా.. బాలీవుడ్‌లో సత్తా చూపిస్తున్న సౌత్ హీరోయిన్లు!

బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ కి ..స్పెషల్లీ టాలీవుడ్ వైపు చూస్తుంటే ..ఇక్కడి హీరోయిన్లు బాలీవుడ్ కి వెళుతున్నారు. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ అవుతున్నారు.

South Heroins: అప్నా టైమ్ ఆయా.. బాలీవుడ్‌లో సత్తా చూపిస్తున్న సౌత్ హీరోయిన్లు!

South Heroins

South Heroins: బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ కి ..స్పెషల్లీ టాలీవుడ్ వైపు చూస్తుంటే ..ఇక్కడి హీరోయిన్లు బాలీవుడ్ కి వెళుతున్నారు. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీఅవుతున్నారు. సమంతా, పూజాహెగ్డే ఇప్పటికే బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ అనిపించుకోగా.. లాస్ట్ ఇయర్ పుష్పతో పాటు టాప్ టక్కర్ లాంటి ఆల్బమ్స్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయిన రష్మిక మందాన, బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీస్ చేస్తోంది. అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమాతో పాటు.. సిద్దార్ధ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా వరుణ్ ధావన్ తో షూటింగ్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది రష్మిక.

South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

బాలీవుడ్ లో పెద్దగా పట్టించుకోని టైమ్ లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వరుస సక్సెస్ లతో మళ్ళీ బాలీవుడ్ లోకి వెళ్లి వరుస సినిమాలు చేస్తోంది రకుల్. రకుల్ రీసెంట్ గా బిగ్ బీ అమితాబ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసింది. అజయ్ దేవ్ గన్ డైరెక్షన్లో అమితాబ్, రకుల్, అజయ్ దేవ్ గన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రన్ వే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఇక ఎటాక్, థాంక్ గాడ్ , డాక్టర్ జి లాంటి మల్టిపుల్ మూవీస్ తో బిజీగా ఉంది రకుల్.

South Heroins: గ్లామర్ డాల్స్ కాదు.. హీరోలతో సమానంగా హీరోయిన్ల మార్కెట్!

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ రాశిఖన్నా.. బ్యాక్ టూ బ్యాక్ హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీఅయిపోయింది. ఆల్రెడీ అజయ్ దేవ్ గన్ తో రుద్ర సిరీస్ తో క్రేజ్ పెంచేసుకుంది రాశి. ఈ సిరీస్ లో నెగెటివ్ రోల్ ప్లే చేసిన రాశి.. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ డికె రాజ్ తో షాహిద్ కపూర్ కాంబినేషన్లో మరో సిరీస్ షూటింగ్ బిజీలో ఉంది. ఇలా టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ కి, బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ కి జంప్ అవుతూ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు.