South Industry : ఇండియన్‌ మూవీ రెవెన్యూలో సౌత్ సినిమాల షేర్ తెలిస్తే షాక్..

2022లో దేశవ్యాప్తంగా మొత్తం సినిమాల వసూళ్లు రూ.15వేల కోట్లు అయితే, అందులో సౌత్ సినిమాల షేర్..

South Industry : ఇండియన్‌ మూవీ రెవెన్యూలో సౌత్ సినిమాల షేర్ తెలిస్తే షాక్..

South Industry share is about 52 percent in indian film revenue

South Industry : ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా నడుస్తుంది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2 వంటి చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యితే RRR తో గ్లోబల్ మార్కెట్ కూడా ఓపెన్ అయ్యింది. ఇక ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ఆయా ఇండస్ట్రీస్ లో టాప్ లో నిలవడమే కాదు ఇండియన్ మూవీ రెవెన్యూలో కూడా మేజర్ షేర్ ని సొంతం చేసుకున్నాయి. గత ఏడాది రిలీజ్ అయ్యిన RRR – 1200 కోట్లు, 1200 కోట్లు, కాంతార – 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

Tollywood : ఇండియన్ సినిమాకి పాన్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది టాలీవుడ్.. నేపాలీ సూపర్ స్టార్!

కాగా దేశవ్యాప్తంగా 2022లో మొత్తం సినిమాల వసూళ్లు రూ.15వేల కోట్లు పైగా వచ్చాయట. అయితే ఈ రెవిన్యూలో 52 శాతం మన సౌత్ సినిమాలదే. గత ఏడాది దక్షిణాది చిత్రాలకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ రూ.7,836 కోట్లు అని తెలియజేశారు. దీంతో సినిమా విజయలతోనే కాదు రెవెన్యూ పరంగా కూడా సౌత్ సినిమాలు నార్త్ మూవీలను డామినేట్ చేసేశాయి. అలాగే సినిమాల విడుదల విషయంలో కూడా సౌత్ ఇండస్ట్రీనే ముందు ఉంది. 2022లో మొత్తం 1,691 చిత్రాలు విడుదల కాగా వాటిలో దక్షిణాది రాష్ర్టాలకు చెందినవి 916 సినిమాలు. సినిమా ప్రొడక్షన్ విషయంలో కూడా 54 శాతం సౌత్ ఇండస్ట్రీ ముందు ఉంది.

Sudigali Sudheer : ప్రభాస్‌ దర్శకుడితో సుడిగాలి సుధీర్‌ సినిమా.. నిజమేనా?

ఇక ఈ ఏడాది అంచనాలకు వస్తే.. గడిచిన నాలుగు నెలలో రిలీజ్ అయిన సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువుగానే ఉంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో నమోదు చేస్తున్నాయి. కాగా గతేడాది కన్నా తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలు ఎక్కువ వసూళ్లు సాధిస్తాయని చెబుతున్నారు ట్రేడ్ పండితులు జోశ్యం చెబుతున్నారు. అయితే కన్నడ సినిమాలు మాత్రం ఈ ఏడాది జోరు కొంచెం తగ్గవచ్చు అని చెబుతున్నారు. కాగా కన్నడ పరిశ్రమ నుంచి ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘కబ్జ’ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.