South Movies: బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్న.. మ.. మ.. మాస్! South mass Movies get huge collections at cinema Box office

South Movies: బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్న.. మ.. మ.. మాస్!

మాస్ గ్లూకోజ్ ఎక్కించి ఆడియెన్స్ కు కావాల్సినంత బూస్టప్ ఇస్తున్నారు డైరెక్టర్స్. ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని మాస్ డోస్ లతో బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్నారు.

South Movies: బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్న.. మ.. మ.. మాస్!

South Movies: మాస్ గ్లూకోజ్ ఎక్కించి ఆడియెన్స్ కు కావాల్సినంత బూస్టప్ ఇస్తున్నారు డైరెక్టర్స్. ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని మాస్ డోస్ లతో బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్నారు. కరెక్ట్ కథకి.. కటౌట్ ఉన్న హీరో దొరికితే.. ఆ హీరోకి ఎక్జైటెడ్ ఎలివేషన్స్ యాడ్ అయితే కథ వేరుంటది బాసు అని తేల్చేస్తున్నారు. బాలీవుడ్ ను సునాయసంగా సౌత్ ఢీకొడుతుంటే కారణం.. మ…మ. మాసే కదా. ఎక్కడికో వద్దు.. ఒక్కసారి కోవిడ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాలే తీసుకుందాం. వాటిలో ఎక్కువశాతం పాన్ ఇండియా లెవెల్ కి సక్సెస్ ఫుల్ గా రిచ్ అయ్యాయి అంటే మాస్, యాక్షన్ మిక్స్ చేయడమే రీజన్. అలా అని కథలో సరుకు లేకుంటే మూలకు పడాల్సిందే.

South Movies: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌత్.. మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్!

మాస్ కా బాప్ లా వచ్చి హిస్టరీ క్రియేట్ చేస్తోన్న కేజీఎఫ్ మాస్ ఫార్ములాని పక్కాగా అమలు పర్చిన సినిమానే. రాకింగ్ స్టార్ యశ్ ని మాస్ బ్రాండ్ అంబాసిడర్ లా ప్రశాంత్ నీల్ మల్చిన తీరు కోట్లకు కోట్లు వెనకేసుకునేలా చేసింది. గన్ పట్టుకుని రాఖీభాయ్ హై ఇంటెన్స్ డైలాగ్స్ డెలీవరి చేస్తుంటే మాస్ ఆడియెన్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఇండియాలో బి,సి సెంటర్లలోని ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయితే.. అది కమర్షియల్ గా విజయం సాధించినట్టే. అదిగో అక్కడే కేజీఎఫ్ బలమైన ముద్ర వేసుకుంది. డార్క్ మోడ్ లో రగ్డ్ అండ్ రఫ్ లుక్ లో యశ్ చేసే పోరాటాన్ని చూడటానికి.. ఆ మూవీలోని థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ ను.. వాటిని ఎలివేట్ చేసే మ్యూజిక్ మ్యాజిక్ ను ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు జనం. కన్నడ కాదు సౌత్ కాదు పాన్ ఇండియా లెవెల్ లో కేజీఎఫ్ చూపిస్తున్న మాస్ జాతరను చూస్తే ఒక్కొక్కరికి చెమటలు పడుతున్నాయి.

South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!

ఎన్నో అంచనాలు పెంచిన ట్రిపుల్ ఆర్ ను దాటేసి కేజీఎఫ్ చాప్టర్ 2 కేవలం హిందీ మార్కెట్ లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. సినిమా బావుంటే వారం ఆడటమే గగనమైన ఈరోజుల్లో 25 రోజులు సక్సెస్ ఫుల్ రన్ కొనసాగించడం.. భారీ బడ్జెట్ సినిమాలను వెనక్కు నెట్టేసి 1150 కోట్లకు మించిన రాబడితో 2022 హైయ్యెస్ట్ గ్రాస్ మూవీగా నిలవడం.. బాహుబలి2 కలెక్షన్స్ ను బీట్ చేసే దిశగా ఇంకా పరుగులు తీయడమంటే అది మామూలు విషయం కాదు.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

కెజిఎఫ్ చాప్టర్ 1తో మళ్లీ మొదలైన మాస్ ట్రెండ్ పుష్పతో పీక్స్ కు చేరింది. పాన్ ఇండియా లెవెల్ లో మాస్ కున్న పల్స్ ఎలాంటిదో ప్రూవ్ చేసింది. హిందీ దర్శకనిర్మాతలు కేవలం మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారని అసలైన మాస్ ని వదిలేయడం ఎంత మూర్ఖత్వమో ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని ప్రముఖ అనలిస్టులు నేరుగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప రిజల్ట్ కూడా పెద్ద పెద్ద తలకాయలకి షాక్ ఇచ్చేదే. తెలుగుకన్నా హిందీలో త్వరగా బ్రేక్ ఈవెన్ సాధించడం అదీ పెద్దగా ప్రమోషన్స్ లేకుండా అంటే మాస్ ఆడియెన్స్ ఎంత ఆకలితో ఉన్నారో అర్ధమవుతోంది. ఎప్పుడైతే జానల మధ్య నుంచి క్యారెక్టర్స్ పుడతాయో అవి ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోతాయి. అలా వచ్చిన రాఖీభాయ్.. ఆ తర్వాత సుకుమార్ తీసుకొచ్చిన పుష్పరాజ్ అసలైన కమర్షియల్ లెక్కలు చూపించాయి. పుష్పరాజ్ గా బన్నీ మారిన తీరు జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే పుష్ప సీక్వెల్ కోసం అంతలా జనాలు ఎదురుచూస్తున్నారు.

South Movies: బాలీవుడ్‌ను వెంటాడుతున్న సౌత్.. సైడ్ ఇచ్చేస్తున్న బీటౌన్!

సీనియర్ హీరో బాలయ్య లాస్ట్ ఇయర్ అఖండతో మ్యాసివ్ సక్సెస్ దక్కించుకున్నారు. అసలే బోయపాటి… ఆపై బాలయ్య తోడైతే బి, సి సెంటర్లే కాదు ఏ సెంటర్లలో కూడా దడ పుట్టాల్సిందే. సేమ్ మ్యాజిక్ అఖండ విషయంలో రిపీట్ అయింది. చెప్పాలంటే కొవిడ్ టైమ్ లో బాలయ్యను 100 కోట్ల క్లబ్ లో చేర్చి నెవర్ బిఫోర్ రికార్డ్ ను సాధించిపెట్టింది. ఇందులో రఫ్పాడించే యాక్షన్ సీన్స్ తో పాటూ బాలయ్య మాస్ మూవ్ మెంట్స్, భారీ డైలాగ్స్, రీసౌండ్ కలిపి నందమూరి అభిమానులనే కాదు మిగిలిన వారిని మ్యాసివ్ గా సర్ ప్రైజ్ చేసాయి.

Flop Movies: భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు.. ఫ్యాన్స్‌కు పీడ కల లాంటి డిజాస్టర్స్!

సింపుల్ స్టోరీ లైన్ అదీ మలయాళ క్లాసీ రీమేక్. కానీ పవర్ స్టార్ ను పవర్ ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయింది భీమ్లానాయక్. లాలా భీమ్లా అంటూ ఒక్క పాటతోనే మాస్ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయడంలో మేకర్స్ విజయం సాధించారు. పోలీసాఫీసర్ గా పవన్ అల్టిమేట్ హీరోయిజం, తగ్గేదే లే అన్న లెవెల్ లో రానా విలనిజం కలిసి భీమ్లానాయక్ ను సాలిడ్ హిట్ చేసేసాయి. పవన్ రాకింగ్ ఎలివేషన్స్ కు మెగాఫ్యాన్స్ ఫిదాఅయ్యారు. చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు కూడా బంపర్ హిట్ కొట్టిందంటే.. రూరల్ ఏరియాల్లో కూడా ఆదరణ లభించడమే కారణం. టిల్లు గాడి యాస డైలాగ్స్ కు ప్రేక్షకులు పడిపోయారు. టిల్లు డీజే కొడితే థియేటర్స్ లో చిందులేసారు.

×