Bollywood Remakes : హిట్ సినిమాని రీమేక్ చేసి మరీ ఫ్లాప్ చేస్తున్నారు.. బాలీవుడ్ కథ మారదా??

సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు. ఇప్పటికే ఫ్లాప్ అయిన సినిమాలకు తోడు లేటెస్ట్ గా మరో మూవీ యాడ్ అయ్యింది ఈ లిస్ట్ లో...........

Bollywood Remakes : హిట్ సినిమాని రీమేక్ చేసి మరీ ఫ్లాప్ చేస్తున్నారు.. బాలీవుడ్ కథ మారదా??

south movies remake in Bollywood and getting flops in Bollywood

Bollywood Remakes :  ఏంటో ఈ మధ్య బాలీవుడ్ కి రీమేక్ లు అస్సలు కలిసి రావట్లేదు. సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని, స్టార్ కాస్ట్ తో కంటెంట్ ఉన్న సినిమాల్ని తీసుకుని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్ లో కనీసం 10 పర్సెంట్ హిట్ కూడా కావట్లేదు బాలీవుడ్ లో. బోలెడన్ని అంచనాలతో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు తీరా అక్కడ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లాపడుతున్నాయి.

సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు. ఇప్పటికే ఫ్లాప్ అయిన సినిమాలకు తోడు లేటెస్ట్ గా మరో మూవీ యాడ్ అయ్యింది ఈ లిస్ట్ లో. అలవైకుంఠపురంలో తెలుగులో బన్నీకి కెరీర్ ఆల్ టైమ్ సూపర్ హిట్ అయింది. కోవిడ్ కి ముందు 2020 సంక్రాంతికి ధియేటర్లోకొచ్చిన ఈ సినిమా చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాంగ్స్ తో బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అందుకే అదే ఊపులో అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షెహజాదా గా రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా రీమేక్ అయిన ఈ సినిమా అలవైకుంఠపురం సక్సెస్ ని రిపీట్ చెయ్యడం కాదు కదా కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. కరోనా వల్ల, పఠాన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇటీవల శివర్తికి రిలీజయి మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అన్న అనుమానంలో ఉన్నారు.

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మరో తెలుగు రీమేక్ కూడా బాలీవుడ్ లో డిజాస్టర్ అయ్యింది. నాని ప్రొడ్యూసర్ గా, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మర్డర్ మిస్టరీ మూవీ హిట్ తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ కి మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. అదే సినిమాని రాజ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక మినిమం టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది.

నాని కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ జెర్సీ మూవీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఎమోషన్స్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి నాని లోని కోర్ ఎమోషనల్ యాంగిల్ చూపించిన జెర్సీ మూవీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఇదే సినిమాని గౌతమ్ తిన్ననూరి హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ అస్సలు ఆడలేదు. ఎన్నో అంచనాలతో చాలాసార్లు రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న హిందీ జెర్సీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇలా ఈ మద్య హిందీలో ఏ తెలుగు మూవీ రీమేక్ చేసినా డిజాస్టరే ఫేస్ చేస్తోంది బాలీవుడ్.

తెలుగు సినిమాలే కాదు సౌత్ నుంచి రీమేక్ అయిన చాలా సినిమాలు ఈ మధ్య బాలీవుడ్ లో డిజాస్టర్లే ఫేస్ చేస్తున్నాయి. ఒక చోట హిట్ అయ్యింది కదా అని అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని, హిట్ అవుతుందని రూల్ లేదు. సౌత్ సినిమా రీమేక్ అయినా, సేమ్ డైరెక్టర్ అయినా కూడా సినిమాని ఆదరించడం లేదు బాలీవుడ్. సౌత్ లో సూపర్ హిట్ అయిన తమిళ సినిమా విక్రమ్ వేద సినిమాని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేశారు. విక్రమ్ వేదగా తమిళ్ లో సెన్సేషన్ అయిన మూవీని బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ లో 150 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత హిట్ కాలేకపోయింది.

జాన్వి కపూర్ కూడా వరసగా సౌత్ రీమేక్స్ చేస్తోంది. అయితే ఆ సినిమాలేవీ జాన్వీకి స్టార్ స్టేటస్ తీసుకురావడం లేదు సరికదా మినిమం సక్సెస్ కూడా అవ్వడం లేదు. తమిళ్ లో నయనతార హీరోయిన్ గా చేసిన కొలమావుకోకిల సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో వచ్చిన గుడ్ లక్ జెర్రీ హిట్ కాలేకపోయింది. అంతేకాదు మరో సౌత్ మూవీ హెలెన్ కి రీమేక్ గా జాన్వీ చేసిన మిలీ కూడా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. జాన్వి కపూర్ బ్యాక్ టూ బ్యాక్ చేసిన సౌత్ రీమేక్ లు ఏవీ సక్సెస్ అందించలేకపోయాయి.

అక్షయ్ కుమార్ ఎన్నో అంచనాలతో చేసిన బచ్చన్ పాండే అసలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. తమిళ్ లో జిగర్తాండా, తెలుగులో గద్దలకొండ గణేష్ గా తెరకెక్కిన సినిమాని హిందీలో బచ్చన్ పాండే గా రీమేక్ చేశారు అక్షయ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చెయ్యలేక అక్షయ్ కుమార్ కెరీర్ లోనే డిజాస్టర్ అయ్యింది బచ్చన్ పాండే.

అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ కట్ పుత్లి కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. తమిళ్ లో రాచసన్, తెలుగులో రాక్షసుడుగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా బాలీవుడ్ లో మాత్రం బొక్క బోర్లా పడింది. మర్డర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ కట్ పుత్లి స్టోరీ వైజ్ గా ఎలా ఉన్నా అక్షయ్ కుమార్ క్రేజ్ కూడా సినిమాని నిలబెట్టలేక అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Vinaro Bhagyamu Vishnu Katha : వినరో భాగ్యము విష్ణు కథ.. వినాలన్నా, అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే..

ఈ రీమేక్ లు ఫ్లాప్ అయినా కూడా అక్షయ్ కుమార్ తమిళ్ సూపర్ హిట్ మూవీ సూరారైపొట్రు సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. సుధకొంగర డైరెక్షన్లో సూర్య ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ సినిమాతో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని అక్షయ్ సెల్ఫీ మూవీగా రీమేక్ చేస్తున్నారు అక్షయ్. ఇమ్రాన్ హష్మి, అక్షయ్ జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలాఉంటుందో. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలని తీసుకెళ్లి రీమేక్ చేసి మరీ ఫ్లాప్ ఇస్తున్నారని, బాలీవుడ్ ఈ విషయంలో మారదా అని సౌత్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. గత సంవత్సరకాలంగా పడిపోతున్న బాలీవుడ్ కి పఠాన్ బూస్ట్ ఇచ్చినా అది ఎక్కువకాలం ఉండదేమో అనిపిస్తుంది.