Sonu Sood: సౌత్ VS నార్త్.. అజయ్‌, సుదీప్‌ల ట్విటర్‌ వార్‌పై సోనూసూద్‌ కామెంట్స్!

టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు.

Sonu Sood: సౌత్ VS నార్త్.. అజయ్‌, సుదీప్‌ల ట్విటర్‌ వార్‌పై సోనూసూద్‌ కామెంట్స్!

Sonu Sood

Sonu Sood: టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు. ఇలా సౌత్ ని చూసి బాలీవుడ్ కి చెమటలు పడుతున్నాయిప్పుడు. ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల గురించే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియాస్టార్లే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లే. ఒక్కటేంటి.. అసలు సినిమా ఇండియన్ సినిమా మొత్తం సౌత్ ఇండియా సినిమాల గురించే మాట్లాడుకుంటోంది.

South Movies: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌత్.. మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్!

అయితే.. సౌత్ సినిమాల బాక్సాఫీస్ సక్సెస్ చూసి భరించేలేకపోతోంది బాలీవుడ్. అందుకే.. సౌత్ సినిమాల మీద నోరు పారేసుకుంటోంది. మీ సినిమాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అంటూ కొందరు శ్రీరంగనీతులు చెబుతుంటే.. అసలు ఏముందని వాటిలో అంతగా గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శలకు దిగుతున్నారు. పేరున్న నటులు.. గొప్ప గొప్ప మేకర్సే సౌత్ సినిమాలపై విషం గక్కుతున్నారు.

South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!

ఇక, తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మధ్య మొదలైన ట్విట్టర్ కోల్డ్ వార్ చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఇప్పటికే వర్మ నుండి అభిషేక్ బచ్చన్ వరకు దీనిపై స్పదించి కామెంట్స్ చేయగా.. తాజాగా సోనూసూద్ కూడా స్పందించాడు. ‘భారతదేశం అంతటా ఒకే భాష ఉంది. అదే ఎంటర్‌టైన్‌మెంట్‌. నువ్వు ఏ చిత్ర పరిశ్రమ నుంచి అనేది ఇక్కడ అనవసరం. కానీ నువ్వు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచగలిగితే చాలు వారు నిన్ను ఆదరిస్తారు’ అంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

అంతేకాదు.. ఇకపై దక్షిణాది చిత్రాల ప్రభావం మాత్రం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఖచ్చితంగా ఉంటుందన్న సోనూ ‘ప్రేక్షకుడి అభిరుచుల్లో కూడా కొంత మార్పు వచ్చిందని.. వారు ప్రతి సినిమాలోనూ కంటెంట్‌ను కోరుకుంటున్నారని.. ఓ యావరేజ్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తమ వేల రూపాయలను ఖర్చు చేయాలని అనుకోవడం లేదంటూ సోనూసూద్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. సోను కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.