Sukumar Special Song’s: సుకుమార్ స్పెషల్ సాంగ్స్ అంటే కిర్రాక్కే!

సినిమా ఆడియన్స్ లోకి వెళ్లాలంటే.. ఆడియో అదిరిపోవాలి. సినిమాల విషయంలో స్పెషల్ సాంగ్స్ కుండే క్రేజే వేరు. సినిమా అంతటికీ హైలెట్ అయ్యే ఐటమ్ సాంగ్స్ ని బాగా కాన్సన్ ట్రేట్ చేసి మరీ...

Sukumar Special Song’s: సుకుమార్ స్పెషల్ సాంగ్స్ అంటే కిర్రాక్కే!

Sukumar Special Song's

Sukumar Special Song’s: సినిమా ఆడియన్స్ లోకి వెళ్లాలంటే.. ఆడియో అదిరిపోవాలి. సినిమాల విషయంలో స్పెషల్ సాంగ్స్ కుండే క్రేజే వేరు. సినిమా అంతటికీ హైలెట్ అయ్యే ఐటమ్ సాంగ్స్ ని బాగా కాన్సన్ ట్రేట్ చేసి మరీ చేస్తారు డైరెక్టర్లు. అందుకే పాటల విషయంలో అంత ఇంట్రస్ట్ చూపిస్తారు మేకర్స్. స్పెషల్లీ ఆడియన్స్ కి ఊపుతెచ్చే ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుని మరీ తెరకెక్కిస్తారు డైరెక్టర్లు. ఈ సాంగ్స్ విషయంలో సుకుమార్ స్టైలే వేరు. లేటెస్ట్ గా సుకుమార్ -బన్నీ పుష్ప మూవీలో సమంత స్పెషల్ సాంగ్ సౌత్ ఇండియాని ఓ ఊపు ఊపేస్తోంది.

Radhe Shyam: ట్రైలర్‌పై మేకర్స్ క్రేజీ థాట్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

ఇప్పటి వరకూ కెరీర్ లో స్పెషల్ సాంగ్స్ చెయ్యని సమంత.. ఫస్ట్ టైమ్ సుకుమార్ కోసం స్పెషల్ సాంగ్ చేసింది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ ఆడియన్స్ కి కిక్కెక్కిస్తోంది సమంత. సుకుమార్ సినిమాలు ఎలా ఉన్నా.. మ్యూజిక్ మాత్రం ఎవ్రీ టైమ్ సూపర్ హిట్ అవుతుంది. అంతేకాదు.. సుకుమార్ ఫస్ట్ సినిమా ఆర్య దగ్గరనుంచి ప్రతి సినిమాకీ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రతిసారీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుంది. ఆల్ మోస్ట్ అన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పెట్టే సుకుమార్.. చరణ్, సమంత కెరీర్ సూపర్ హిట్ రంగస్తలంలో స్టార్ హీరోయిన్ చేత స్పెషల్ సాంగ్ చేయించారు. సౌత్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయిపోయిన పూజాహెగ్డేతో జిగేల్ రాణి పాటకు మాస్ స్టెప్పులేయించారు సుకుమార్.

Unstoppable Aha: ఇది వేరే లెవెల్.. బాలయ్య షోలో జక్కన్న-కీరవాణి!

సుకుమార్ కెరీర్ లో చేసిన 8 సినిమాల్లో నాన్నకు ప్రేమతో సినిమాలో తప్పించి అన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో ధియేటర్లలో సందడి చేశారు. సుకుమార్ ప్రతి సినిమాలో పాటలకి కావల్సినట్టు సిచ్యువేషన్స్ ఎరేంజ్ చేస్తారు. ఆ సిచ్యువేషన్స్ కి యాప్ట్ అయ్యేబ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాడు దేవి. మహేష్ బాబు, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో జానీ జానీ యస్ పాపా అంటూక్యాచీ లిరిక్స్ తో మాంచి పెప్పీ నంబర్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. హీరో ఎవరైనా పనిలేదు, వాళ్ల క్రేజ్ తో సంబందం లేదు. హీరో పెద్దా, చిన్నా పట్టించుకోకుండా జస్ట్ సినిమా ఏదైనా ఆల్బమ్ మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అన్నీ సింపుల్ గా, వాడుక పదాలతో ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. అందుకే ఆడియన్స్ కూడా అంతగా అడిక్ట్ అయిపోతారు.

Rajinikanth: ప్లాప్ దర్శకుడితో సూపర్ స్టార్.. అంత నమ్మకం ఏంటి ‘పెద్దన్నా’?

నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన 100 పర్సెంట్ లవ్ లో డియ్యాల డియ్యాల సాంగ్ తో దెబ్బకి ఎక్కడికో వెళ్లిపో్యాడు సుకుమార్. ఎన్ని స్పెషల్ సాంగ్స్ వచ్చినా సుకుమార్ స్టైలే వేరనేలా ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు సుక్కు.సుకుమార్ కెరీర్ లో బన్నీతో చేసిన మరో మూవీ ఆర్య 2. హిట్ టైటిల్ తో వచ్చిన ఈసినిమాలో కూడా సుకుమార్ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చారు. సుకుమార్ సినిమాల్లో డైలాగ్స్ లానే.. సింపుల్ గా క్యాచీ గాఉన్న లిరిక్స్ తో పాట కూడా సూపర్ హిట్ అయ్యింది.

Rashmika Mandanna : షార్ట్ నిక్కర్‌లో ‘సామి.. సామి..’ అంటున్న రష్మిక.. ఇది కూడా ప్రమోషన్స్‌లో భాగమే..

రింగ రింగ అంటూ క్రేజీ స్టెప్స్ తో తెరకెక్కిన ఈ పాటలో అల్లు అర్జున్ తన డాన్సింగ్ టాలెంట్ మొత్తాన్ని చూపించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీలో ఐటమ్ సాంగ్ కూడా సూపర్ డూపర్ గా హిట్ అయ్యింది. ఎక్కువగా హై బడ్జెట్ స్టార్ హీరోలకు మాత్రమే సంగీతమందించే దేవీ.. సుకుమార్ సినిమాలకు మాత్రం అవేవీ చూసుకోడు. ఏ హీరో అయినా వీళ్ల కాంబినేషన్ లో సినిమా అయితే పాటలు హిట్ మోత మోగాల్సిందే. అలా జగడం సినిమా పాటలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

Rashmika Mandanna : ‘పుష్ప’ కోసం చీర కట్టిన శ్రీవల్లి

సుకుమార్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన జగడం సినిమాలో క్రేజీ ఐటమ్ సాంగ్ తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు సుకుమార్. 36-24-36 అంటూ టీజింగ్ గా ఉండే ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. సుకుమార్ ఫస్ట్ మూవీ ఆర్య నుంచే ఈ స్పెషల్ సాంగ్ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య మూవీలో అ..అంటే అమలాపురం.. సాంగ్ తో ఆడియన్స్ కి అదరగొట్టే సాంగ్ ఇచ్చారు సుకుమార్. బన్నీ అదిరిపోయే డాన్స్ కి, క్యాచీగా ఉండే లిరిక్స్ యాడ్ అవ్వడంతో ఈ మాస్ మసాలా సాంగ్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. ఇలా సుకుమార్ కెరీర్ లో చేసిన అన్ని స్పెషల్ సాంగ్స్.. ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యి ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి.