Pawan Kalyan: అన్‌స్టాపబుల్-2 ఫైనల్ ఎపిసోడ్ స్పెషల్ గ్లింప్స్..!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అన్‌స్టాపబుల్-2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ గతవారం ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాగా, బాలయ్య ఆయనతో చేసిన సందడి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఇక ఈ పవర్‌ప్యాక్డ్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తుండటంతో తొలి భాగానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.

Pawan Kalyan: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అన్‌స్టాపబుల్-2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ గతవారం ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాగా, బాలయ్య ఆయనతో చేసిన సందడి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఇక ఈ పవర్‌ప్యాక్డ్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తుండటంతో తొలి భాగానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.
Unstoppable 2: పవన్ పవర్ ఎపిసోడ్‌కు సూపర్ రెస్పాన్స్.. ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..!
ఇక ఇప్పుడు అందరి చూపులు ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్ రెండో భాగంపై పడ్డాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ స్పెషల్ గ్లింప్స్ వీడియోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ షోలో జాయిన్ అయినట్లుగా చూపించారు. ఇక బాలయ్య అడిగే ప్రశ్నలకు క్రిష్ ఎలాంటి సమాధానాలు చెప్పాడనేది మనకు ఈ గింప్స్ వీడియోలో శాంపిల్ చూపెట్టారు.
అంతేగాక, పవన్-బాలయ్యలను దర్శకుడు క్రిష్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. దీనికి సంబంధించి కూడా ఈ వీడియో గ్లింప్స్‌లో మనకు చూపెట్టారు. దీంతో ఈ ఎపిసోడ్ భాగంపై ప్రేక్షకుల్లో మళ్లీ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ పవర్‌ప్యాక్డ్ ఫైనల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు షో నిర్వాహకులు తెలిపారు.