RRR’s Promotional Song: ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్

ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక ప్రచార గీతాన్ని తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేస్తున్నాడు.

RRR’s Promotional Song: ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్

Special Music Director: రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా “మగధీర”. ఈ సినిమా చివర్లో అనగా.. అనగనగా అంటూ ఓ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ సినిమాకి ఆఖర్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సాంగ్‌లో సినిమాకు పనిచేసిన ప్రతీఒక్కరు కనిపించి స్టెప్పులు వేస్తారు. సరిగ్గా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఇదే పద్ధతిలో ఓ సాంగ్‌ని కంపోజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక ప్రచార గీతాన్ని తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేస్తున్నాడు. అనిరుధ్ కంపోజ్ చేస్తున్న ఈ పాట షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్ రెడీ చేసింది చిత్రయూనిట్. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సాంగ్ షూటింగ్‌లో యూనిట్లోని నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ పాల్గొననున్నారు. ఈ పాట షూట్ పూర్తయిన తర్వాత, మరో పాట షూట్ కోసం యూరోప్ వెళ్లబోతోంది ఆర్ఆర్ఆర్ యూనిట్.

అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. ఈ పాటలో ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ తదితరులు ఎన్‌టిఆర్, రామ్ చరణ్ హాజరుకానున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు.

దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతున్న ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఓవిలియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది.