SP Balu : బాలుకి ప్రేమతో.. 100 మంది.. 12 గంటల పాటు నాన్ స్టాప్ సింగింగ్..

జూన్ 4న సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సంగీత కళాకారులతో పాటల కచేరిని................

SP Balu : బాలుకి ప్రేమతో.. 100 మంది.. 12 గంటల పాటు నాన్ స్టాప్ సింగింగ్..

Baluki Prematho

SP Balu :  SP బాలు.. ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికి పాటే గుర్తుకు వస్తుంది. మన జీవితాల్లో బాలు గారి పాట భాగమైపోయింది. ఎన్నో భాషల్లో కొన్ని వేల పాటలు పాడిన బాలు గారు 2020లో కరోనా కారణంగా మరణించి మన అందరికి దూరమయ్యారు. అప్పట్నుంచి ఆయన పాటని, ఆయన్ని ఏదో విధంగా తలుచుకుంటూనే ఉన్నాం. జూన్ 4వ తేదీన బాలు గారి జయంతి సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన్ని తలుచుకుంటూ ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పలువురు సినీ సంగీత కళాకారులు.

జూన్ 4న సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సంగీత కళాకారులతో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ ప్రకటన చేసిన సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌ మాట్లాడుతూ.. ”బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్‌ చేయబోతున్నాం” అని తెలిపారు.

Vikram: ‘విక్రమ్’ బ్లాక్‌బస్టర్ అంటున్నతమిళ హీరో

సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ”30ఏళ్ల చరిత్ర ఉన్న సినిమా మ్యూజిక్‌ యూనియన్‌లో దాదాపు 1500మందికి పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా సింగర్స్‌ అవుదామనుకునేవారికి మా యూనియన్‌ లో ఉంటే వారు సినిమా, టీవీ, ఓటిటి ఇలా ఎక్కడ పనిచేసినా వారికి మా సంస్థ తరపునుండి పూర్తి సహాయసహకారాలను అందచేస్తాము. బాలుగారు మా కులదైవంలాంటి వారు. ఆయనే స్వయంగా 2019లో మా యూనియన్‌ సభ్యులకోసం ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ప్రోగ్రామ్‌ని కన్నులపండుగలా నిర్వహించి మా అందరికీ మార్గదర్శకులుగా నిలిచారు బాలుగారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్‌ కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. అందుకే జూన్‌ 4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్‌ తరపున ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ రావొచ్చు” అని తెలిపారు.