Bro Movie : పవన్, తేజ్ ‘బ్రో’ సినిమాలో బాలీవుడ్ భామతో స్పెషల్ సాంగ్? ఒరిజినల్ వర్షన్‌లో లేకపోయినా..

ఇప్ప‌టికే బ్రో సినిమా షూటింగ్ పూరైందని, పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్యక్రమాలు జరుపుకుంటుంది చిత్రయూనిట్ తెలిపారు. ఇక ఈ సినిమాను జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తుంది.

Bro Movie : పవన్, తేజ్ ‘బ్రో’ సినిమాలో బాలీవుడ్ భామతో స్పెషల్ సాంగ్? ఒరిజినల్ వర్షన్‌లో లేకపోయినా..

Special Song in Pawan Kalyan Sai Dharam Tej Bro Movie with Urvashi Rautela

Urvashi Rautela : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్‌(Sai Dharam Tej) క‌లిసి న‌టిస్తున్న సినిమా ‘Bro’. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన వినోద‌య సితం(Vinodaya Sitham) కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సముద్రఖని(Samuthirakani) ద‌ర్శ‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు.

ఇప్ప‌టికే బ్రో సినిమా షూటింగ్ పూరైందని, పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్యక్రమాలు జరుపుకుంటుంది చిత్రయూనిట్ తెలిపారు. ఇక ఈ సినిమాను జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తుంది. బ్రో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నారట. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల టాలీవుడ్ లో వరుసగా స్పెషల్ సాంగ్స్ లో ఛాన్స్ దక్కించుకుంటుంది. దీంతో బ్రో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కి ఊర్వశి రౌతేలాను తీసుకున్నట్టు సమాచారం.

NTR – Ram Charan : ప్రశాంత్ నీల్‌కి చరణ్ విషెస్.. ఎన్టీఆర్ నాటుకోడి పులుసు ట్రీట్..

హైదరాబాద్ లోని ఓ పబ్ లో ఈ సాంగ్ షూట్ జరగబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ఓపాటలో పవన్ ఉంటాడో, ఉండడో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ తమిళ్ వినోదయ సితం సినిమాలో మాత్రం ఎలాంటి స్పెషల్ సాంగ్ లేదు. అసలు ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కి స్కోప్ కూడా లేదు. మరి తెలుగులో ఎలా పెడతారో చూడాలి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజయిన పోస్టర్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ బ్రో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.