Special Songs: రేంజ్ పెరిగిన ఐటెం సాంగ్స్.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్!

ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్..

Special Songs: రేంజ్ పెరిగిన ఐటెం సాంగ్స్.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్!

Special Songs

Special Songs: ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చెయ్యడంతో సినిమా లుక్కే మారిపోతోంది. అంతే కాదు.. జనాలకు కూడా ఎక్స్ పెక్ట్ చేసినంత కిక్కిస్తోంది. సినిమాకు హీరో, హీరోయిన్లతో పాటు.. స్పెషల్ సాంగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈమధ్య ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ పెరగడంతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి కిక్కెక్కించే స్పెషల్ సాంగ్స్ తో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

లేటెస్ట్ గా వరుణ్ తేజ్ గని మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసిం టీమ్. వరుణ్ తేజ్ గని మూవీలో కొడ్తే సాంగ్ తో కుర్రాళ్లని గిలిగింతలు పెట్టడానికి రెడీ అయ్యింది. పోస్టర్ తోనే సాంగ్ మీద ఇంట్రస్ట్ పెంచేస్తోంది తమన్నా. ఈ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చెయ్యడం కొత్తేం కాదు.. లాస్ట్ టైమ్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ లో ఆజ్ రాత్ పార్టీ హే అంటూ ఎంటర్ టైన్ చేసింది. అంతేకాదు.. కేజీఎఫ్ లో కూడా క్లబ్ సాంగ్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది తమన్నా.

Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

రీసెంట్ గా మరో స్టార్ హీరోయిన్ సమంత.. పుష్పలో ఊ అంటావా ఊఊ అంటావా అంటూ హీటెక్కించింది. సమంత నెవర్ బిఫోర్ లుక్ లో ఒక రకంగా ఫాన్స్ కి షాకిచ్చిందనే చెప్పాలి. ఒక వైపు స్టార్ హీరోయిన్ గా సౌత్ మొత్తం సినిమాలు చేస్తూ.. మరో వైపు అల్లు అర్జున్ తో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ సర్ ప్రైజ్ చేసింది సమంత. ఈ పాట అనుకున్న దానికంటే అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

మరో హీరోయిన్ రెజీనా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసింది. కొరటాల శివ డైరెక్షన్లో.. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో శానాకష్టం అంటూ యూత్ తో పాటు అందర్నీ టార్గెట్ చేసింది. మెగాస్టార్ కోసమే స్పెషల్ సాంగ్ చేశానన్న రెజీనా.. తన ఎక్స్ ప్రెషన్స్ తో సాంగ్ ని వేరే లెవల్ కి తీసుకెళ్లింది. ఇలా ఒక వైపు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లుగా పనిచేస్తూనే.. మరో వైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు మన హీరోయిన్లు.