Sports Movies : ఆటే కథ.. ఆటే సినిమా.. గేమ్స్ తో బాక్సాఫీస్ లో గోల్ కొడుతున్నారు

ప్రపంచంలో ఎన్ని సినిమాలొచ్చినా కథలు కొన్నే. కాని చెప్పే విధానం వేరు. మనకు తెలిసిన కొన్ని జోనర్స్ లోనే ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చూస్తున్నాము. చాలా సినిమాలకి ప్రేమే కథాంశం. ఇటీవల

10TV Telugu News

Sports Movies :  ప్రపంచంలో ఎన్ని సినిమాలొచ్చినా కథలు కొన్నే. కాని చెప్పే విధానం వేరు. మనకు తెలిసిన కొన్ని జోనర్స్ లోనే ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు చూస్తున్నాము. చాలా సినిమాలకి ప్రేమే కథాంశం. ఇటీవల గత కొన్ని సంవత్సరాల నుంచి కొత్త కొత్త జోనర్స్ వస్తున్నాయి. కొత్త ఫిలిం మేకర్స్ రకరకాల కథల్ని సృష్టిస్తున్నారు. భారతదేశంలో కూడా ఎక్కువ లవ్ స్టోరీలే ఆడతాయి. ఒకప్పుడు హీరోలు కొత్త ప్రయోగాలు చేయాలి అంటే భయపడేవారు. కాని ఇప్పుడు కొత్త ప్రయోగాలకు మక్కువ చూపుతున్నారు. ఇటీవల అన్ని సినిమా పరిశ్రమల్లోనూ బాగా వినిపిస్తున్న జోనర్ స్పోర్ట్స్.

ఒకప్పుడు కొన్ని సినిమాల్లో స్పోర్ట్స్ ఒక పాత్రలాగా ఉండేవి. కాని ఇప్పుడు స్పోర్ట్స్ ప్రధానాంశంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రతి ఆటని కథగా మలుస్తున్నారు రచయితలు. ఆ కథని అందంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు. వేరే కథల సినిమాలు ఈజీగా రాయొచ్చు. కాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు రాయాలంటే ఆ స్పోర్ట్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఆ ఆట గురించి పరిశోధన చేయాలి. ఇందులో కొంచెం తేడా వచ్చిన సినిమా విమర్శలపాలవుతుంది. అందుకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసే దర్శకులు ఆ ఆట గురించి ప్రతిదీ పూర్తిగా తెలుసుకుంటున్నారు. మన దేశంలో చాలా మందికి తెలిసిన ఆట క్రికెట్. ఒకప్పుడు కూడా క్రికెట్ కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. కాని ఆ సినిమాల్లో క్రికెట్ అంతర్లీనంగా ఉండేది. ఇప్పుడు వచ్చే స్పోర్ట్స్ సినిమాల్లో క్రికెట్ మాత్రమే కాక వేరే ఆటల్ని కూడా తెరకెక్కిస్తున్నారు.

Pushpa : ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ తో చిందేసిన శ్రీవల్లి

ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలంటే కేవలం ఆటనే చూపించకుండా ఆ ఆటలో ఉండే ఎమోషన్స్, ఆట ఆడే వాళ్ళ ఫీలింగ్స్. ఓడిపోయిన వాళ్ళ బాధ, గెలిచిన వాళ్ళ ఆనందం, క్రీడాకారులకు ఆ ఆట మీద ఉన్న ప్రేమ.. ఇలా ప్రతిదీ అందంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తేడా లేకుండా ఇటీవల అన్ని పరిశ్రమలలోని స్పోర్ట్స్ కథాంశంతో సినిమాలు వచ్చి మంచి విజయం సాధిస్తున్నాయి. కలెక్షన్స్ తో పాటు అవార్డులు కూడా సాధిస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే చాలా మంది అదే ఫార్ములా వాడతారు. ఇక్కడ కూడా అంతే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా హిట్ అయితే అంతా స్పోర్ట్స్ సినిమాలే ట్రై చేస్తున్నారు. ఒకవేళ స్టార్ హీరోలు స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తే ఆ స్పోర్ట్ కి కమర్షియల్ వ్యాల్యూస్ అద్దుతున్నారు.

Sherlin Chopra : శిల్పాశెట్టి దంపతులపై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన షెర్లిన్ చోప్రా

ఇటీవల తెలుగులో క్రికెట్ కథాంశంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘జెర్సీ’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు ప్రేక్షకుల్ని సీట్లలో కట్టి పడేశాయి. ఆ సినిమాలు చూసి మనం కూడా ఏడ్చేశాం. ‘జెర్సీ’ ఎంత మంచి విజయం సాధించిందో మనకి తెలుసు, నేషనల్ అవార్డు కూడా దక్కింది. నాని కెరీర్ లో బెస్ట్ సినిమాగా మిగిలిపోతుంది. ఇక హాకీ కథాంశంతో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమా, చెస్ కథాంశంతో ‘చెక్’ సినిమా, కబడ్డీ కథాంశంతో ‘సీటిమార్’ సినిమాలు వచ్చాయి. త్వరలో బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’, ‘లైగర్’ సినిమాలు రాబోతున్నాయి. ఆర్చరీ నేపథ్యంలో ‘లక్ష్య’ సినిమా, షూటింగ్ నేపథ్యంలో ‘గుడ్ లక్ సఖి’ సినిమాలు రాబోతున్నాయి. మరి కొన్ని సినిమాలు కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నాయి.

Pooja Hegde : కొత్త ఇంట్లోకి పూజహెగ్డే.. ముంబైలో సూపర్ హౌస్..

ఇక తమిళ్ లో ఫుట్ బాల్ నేపథ్యంలో ‘బిగిల్’, తమిళ్ సాంప్రదాయ ఆట ‘జల్లికట్టు’, బాక్సింగ్ నేపథ్యంలో ‘సరపట్ట పరంబరాయ్’ సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. మలయాళంలో ఇటీవలే మనం చిన్నప్పుడు ఎంతోమంది ఆడిన ఆట ‘ఖో ఖో’ని సినిమాగా మలిచి మెప్పించారు.

Lavanya Tripathi : నిన్న నివేదా.. నేడు లావణ్య.. పర్వతాలను ఎక్కేస్తున్న హీరోయిన్స్

ఇక బాలీవుడ్ లో అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకి కొదవ లేదు. బాలీవుడ్ లో బయోపిక్ స్పోర్ట్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మన దేశంలో స్పోర్ట్స్ లో ఉన్న గ్రేట్ పర్సనాలిటీస్ జీవిత చరిత్రలని తెరకెక్కిస్తున్నారు. క్రికెట్ వీరులు ధోని, సచిన్ బయోపిక్స్ వచ్చాయి. త్వరలో యువరాజ్ బయోపిక్ కూడా రాబోతుంది. ఇక మనం మొదటి సారి క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించిన చరిత్రని ’83’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. రన్నింగ్ ని బేస్ చేసుకొని ఇటీవల ‘రష్మీ రాకెట్’ సినిమా, ఫుట్ బాల్ కథాంశంతో ‘మైదాన్’ సినిమా, బాక్సింగ్ నేపథ్యంలో ‘తుఫాన్’ సినిమాలు వచ్చాయి. అంతకుముందు హాకీ నేపథ్యంలో ఓ హాకీ ఆటగాడి జీవిత చరిత్రని ‘చక్ దే ఇండియా’గా చిత్రీకరించారు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఒలంపిక్ రన్నర్ మిల్కా సింగ్ జీవిత చరిత్రని ‘భాగ్ మిల్కా భాగ్’ గా తెరకెక్కించారు. కుస్తీ పోటీల నేపథ్యంలో ‘దంగల్’ సినిమాని, ఒలంపిక్ విజేత ‘మేరీ కోమ్’ జీవిత చరిత్రని, సైనా నెహ్వాల్ జీవిత చరిత్రని అద్భుతంగా చిత్రీకరించారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ శ్రీరామచంద్ర కోసం మొన్న హీరోయిన్.. ఇవాళ బాలీవుడ్ కమెడియన్

ఇలా ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్పోర్ట్స్ ని మంచి కథాంశంగా తీసుకొని కమర్షియల్ గా తెరకెక్కించి విజయం సాధిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో స్పోర్ట్స్ సినిమాలు, ఎంతో మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ జీవిత చరిత్రలు రాబోతున్నాయి. వచ్చి విజయం కూడా సాధిస్తాయి అనటంలో సందేహం లేదు.