Squid game : సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్‌ని విమర్శిస్తున్న పాకిస్థాన్

ప్రపంచమంతా స్క్విడ్ గేమ్‌ సిరీస్ ని ప్రశంశిస్తుంటే పాకిస్థానీలు మాత్రం విమర్శిస్తున్నారు. దీనికి కారణం ఈ సిరీస్ లో ఓ పాకిస్థానీ క్యారెక్టర్ ని భారతీయ నటుడు

Squid game : సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్‌ని విమర్శిస్తున్న పాకిస్థాన్

Squid Game

squid game :  ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ హవా నడుస్తుంది. స్క్విడ్ గేమ్‌ సిరీస్ గురించి తెలియని వారు చాలా తక్కువ. గత నెల 17వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలో రికార్డులు సృష్టించింది. విడుదలైన నెలరోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ యూజర్లు స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ ను చూడడం విశేషం. కొరియన్ భాషలో దీనిని నిర్మించారు. మన దేశంలో కూడా దీనికి డిమాండ్ బాగా ఉంది. ప్రపంచమంతా స్క్విడ్ గేమ్‌ సిరీస్ ని ప్రశంశిస్తుంటే పాకిస్థానీలు మాత్రం విమర్శిస్తున్నారు.

పాకిస్థానీలు ఇప్పుడు స్క్విడ్ గేమ్‌ ని విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ ని నిర్మించిన సంస్థని కూడా విమర్శిస్తున్నారు. దీనికి కారణం ఈ సిరీస్ లో ఓ పాకిస్థానీ క్యారెక్టర్ ని భారతీయ నటుడు పోషించడమే. ముందు నుంచి పాకిస్థాన్ వాళ్ళు మన మీద ద్వేషం చూపిస్తారు. వాళ్ళ సినిమా పరిశ్రమ కంటే మనది చాలా పెద్ద పరిశ్రమ. మన నటులు ప్రపంచంలోని అన్ని భాషల్లో నటిస్తున్నారు. ఇలాగే ఈ సిరీస్ లో దక్షిణ కొరియాలో డాక్యుమెంట్ లేకుండా ఉండే పాకిస్తానీ వలస కార్మికుడు అలీ అబ్దుల్ పాత్రను భారతీయ నటుడు అనుపమ్ త్రిపాఠి పోషించారు. అయితే ఈ సిరీస్ లో ఇతను చాలా సాఫ్ట్, మంచి వాడిగా, నమ్మకమైనవాడిగా మంచి పాత్రలో నటించాడు. ఈ పాత్రకి మంచి పేరు వస్తుంది.

Avinash : పెళ్లికొడుకయిన బిగ్ బాస్ కంటెస్టెంట్

ఇప్పుడు దీన్ని పాకిస్థానీలు విమర్శిస్తున్నారు. ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తున్నారు. ఒక ట్విట్టర్ యూజర్.. ఒక భారతీయ నటుడు పాకిస్తానీ పాత్రలో ఎందుకు నటించాలని ప్రశ్నిస్తున్నారు. మరొకరు.. పాకిస్థానీ పాత్రలు పోషించడానికి భారతీయులను నియమించుకునే చిత్రనిర్మాతలు విసిగి పోయి ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఇంకో యూజర్.. ఈ కార్యక్రమం బాగుంది కానీ పెద్ద టీవీ సిరీస్‌లలో పాకిస్తానీ పాత్రలను భారతీయ నటులు పోషించడం చూసి చాలా నిరాశ చెందాను అని, అసలు పాకిస్తానీ నటులను ఈ పాత్రల కోసం ఈ ప్రొడక్షన్‌లు ఎందుకు తీసుకోవు అని ప్రశ్నించాడు.

Bigg Boss 5 : ఈ సారి నామినేషన్స్‌లో వీళ్లేనా??

మరొకరు.. మనీ హైస్ట్ సిరీస్ లో కూడా ఇలాగే జరిగింది. అందులో ఓ పాకిస్థానీ హ్యాకర్ పాత్రని భారతీయ నటుడు పోషించాడు అని అన్నారు. ఇంకొకరు.. స్క్విడ్ గేమ్‌ లో పాకిస్థానీ పాత్రలో నటించిన త్రిపాఠి నిజ జీవితంలో కూడా ముస్లిం కాదని చెప్పాడు. ఇంకొకరు ఏకంగా పాకిస్తానీ పాత్ర కోసం భారతీయ నటుడ్ని తీసుకోవడం చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించిందని పోస్ట్ చేశాడు.

Akhil : అయ్యగారి ఫ్యాన్ ని కలుస్తా అంటున్న అఖిల్

ఇలా పాకిస్థానీలు విమర్శిస్తుంటే కొంతమంది వాళ్ళ విమర్శలకి సమాధానాలు చెప్తున్నారు. ఒక యూజర్.. ఆ పాకిస్థానీ పాత్రని పోషించిన అతను అక్కడే కొరియాలో ఉంటాడు. కొరియాలో చదువుకున్నాడు. అక్కడ చాలా కొరియన్ సినిమాల్లో నటించాడు. అందుకే అతన్ని తీసుకున్నారు. పాకిస్థాన్ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళని తీసుకునే వాళ్ళు అని అన్నారు. ఇక పాకిస్తాన్‌ హాస్యనటుడు అలీ గుల్ పిర్ దీనిపైనా మాట్లాడుతూ.. భారతదేశంతో పోలిస్తే మన దేశం మరియు మన సినీ పరిశ్రమ చాలా చిన్నది కాబట్టి భౌతిక రూపంతో పాటుగా ఒక భారతీయ నటుడిని కూడా పాత్రలో నటించడానికి ఎంచుకోవడం సమంజసం. అతను కూడా కొరియన్ అనర్గళంగా మాట్లాడతాడు. ఇది కాస్టింగ్ కోసం ప్రధాన అవసరాలలో ఒకటి. అతను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అంటూ సపోర్ట్ చేశారు.