SR Kalyanamandapam : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..!

కిరణ్ కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది..

SR Kalyanamandapam : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..!

Sr Kalyanamandapam

SR Kalyanamandapam: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యి, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం EST. 1975’ అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించింది కిరణ్ అబ్బవరం కావడం విశేషం. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించింది. ప్రోమోస్, సాంగ్స్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Kiran Abbavaram

ట్రైలర్ చూసినవాళ్లంతా.. ‘సింప్లీ సూపర్బ్, కిరణ్ అబ్బవరం రూపంలో మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టాలీవుడ్‌కి దొరికాడు. ఈ సినిమాతో అతనికి స్టార్‌డమ్ వస్తుంది’ అంటున్నారు.. కిరణ్ కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ చాలా రోజుల తర్వాత సాలిడ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకోబోతున్నారు.

విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. అన్ని పనులు కంప్లీట్ చేసి ఆగస్టు 6న ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యనున్నారు. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాలో తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతమందిచారు.