Aha : ‘ఆహా’ లో.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’..

తెలుగు ప్రేక్షకులకు అంతులేని ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న 100% తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది..

Aha : ‘ఆహా’ లో.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’..

Sr Kalyanamandapam

Aha: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యి, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం EST. 1975’ అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.

Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..

లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు పున: ప్రారంభమైన తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన నాలుగు రోజులకే పెట్టిన పెట్టుబడి రాబట్టేసింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించింది కిరణ్ అబ్బవరమే కావడం విశేషం. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించగా..‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించింది.

Venky – Rana : బాబాయ్ – అబ్బాయ్‌.. మధ్యలో నిషా..

కిరణ్, ప్రియాంకల కెమిస్ట్రీ, పర్ఫార్మెన్స్, సాయి కుమార్ క్యారెక్టర్, కామెడీ టైమింగ్, సాంగ్స్ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకొస్తుంది. పాపులర్ వెబ్ సిరీస్, బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న 100% తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ‘తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం ‘SR కళ్యాణ మండపం’ అతి త్వరలో మీ ‘ఆహా’ లో విడుదల అవబోతుంది. సిద్ధంగా ఉండండి!’.. అంటూ ఫ్యాన్సీ రేటుకి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు ‘ఆహా’ యాజమాన్యం తెలియజేశారు.

‘ఆహా’ త‌మ ప్రేక్షకుల కోసం తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందించింది. మ‌మ్ముట్టి నటించిన ‘వ‌న్‌’, న‌య‌న‌తార ‘నీడ‌’, రిష‌బ్ శెట్టి ‘హీరో’, టోవినో థామ‌స్ యాక్ష‌న్ మూవీ ‘కాలా’, విజ‌య్ సేతుప‌తి ‘విక్ర‌మార్కుడు’, మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’.. వంటి చిత్రాలు స‌హా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘ఆహా’ అందించింది.

Chatur Mukham : ‘ఆహా’ లో మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’..

రీసెంట్‌గా అమ‌లా పాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా విడుద‌లైన సై ఫై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడ‌మైతే’ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. లక్ష్మీ మంచు హోస్ట్‌గా సెల‌బ్రిటీలు చేస్తున్న వంట‌ల షో ‘ఆహా భోజ‌నంబు’ ల‌తో పాటు ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘జాంబి రెడ్డి’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి సినిమాలు, ఒరిజ‌న‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’.

SR Kalyanamandapam : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..!