Salaar : ‘సాహో’ బ్యూటీతో ‘సలార్‌‌’లో ఐటమ్‌సాంగ్

ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. 'సలార్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ......

Salaar : ‘సాహో’ బ్యూటీతో ‘సలార్‌‌’లో ఐటమ్‌సాంగ్

Salaar

Salaar :  ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలని చేస్తున్నాడు. త్వరలో సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ‘కెజిఎఫ్’ సినిమాతో ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

Vikki-Katrina : ఓ వైపు పెళ్లి వేడుకలు.. మరోవైపు విక్కీ కత్రీనాలపై కేసు నమోదు

‘సలార్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ని అడిగినట్టు సమాచారం, శ్రద్ధా అంతకుముందే ప్రభాస్ తో కలిసి ‘సాహో’లో నటించింది. బాలీవుడ్ లో కూడా శ్రద్దా స్టార్ హీరోయిన్ కావడంతో ఈ సినిమాకి తీసుకుంటే బాలీవుడ్ లో కూడా బాగా మార్కెట్ అవుతుందని ఇందులో స్పెషల్ సాంగ్ కోసం ఈ బాలీవుడ్ భామని తీసుకోబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్ షూట్ కూడా ఉండబోతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.