Sree leela : మాస్ హీరోకి జోడిగా ‘పెళ్లి సందడి’ హీరోయిన్

శ్రీలీల కూడా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ని ఆకర్షించింది. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు శ్రీలీలకు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే 'మాస్ మహారాజా' రవితేజ సరసన "ధమాకా" సినిమాలో

Sree leela : మాస్ హీరోకి జోడిగా ‘పెళ్లి సందడి’ హీరోయిన్

Sreeleela

Sree leela :  ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో తెరకెక్కిన సినిమా “పెళ్లి సందడి”. ఈ సినిమాతో శ్రీకాంత్‌ తనయుడు రోషన్ ను హీరోగా, శ్రీలీలను హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా మొదటి సినిమాతోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో పాటల్లో రొమాన్స్ ఉంటుంది. హీరోయిన్ ని కూడా చాలా అందంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ శ్రీలీలని చాలా అందంగా చూపించారు. శ్రీలీల కూడా తన నటనతో పాటు గ్లామర్‌తో కూడా జనాల్ని అలరించింది. ఇటీవల మొదటి సినిమాతోటే మంచి పేరు తెచ్చుకొని టాలీవుడ్ లో వరుస ఛాన్సులు సంపాదిస్తున్నారు కొత్త హీరోయిన్స్.

Payal Rajputh : మొన్నటిదాకా రియల్ లైఫ్ లో.. ఇప్పుడు రీల్ లైఫ్ లో.. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న పాయల్

తాజాగా శ్రీలీల కూడా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ని ఆకర్షించింది. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు శ్రీలీలకు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ‘మాస్ మహారాజా’ రవితేజ సరసన “ధమాకా” సినిమాలో నటించే అవకాశం సంపాదించింది. క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా మాస్ సినిమాలు కూడా చేసి అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు మాస్ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని చూస్తుంది శ్రీలీల. శ్రీలీల డ్యాన్స్ కూడా బాగా చేస్తుండటంతో పెద్ద హీరోల సరసన కూడా నటించే అవకాశం ఉంది. రవితేజ సినిమాతో పాటు మరో పెద్ద సంస్థ కూడా శ్రీలీలకి సినిమా ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ కన్నడ బ్యూటీ త్వరలోనే తెలుగులో స్టార్ అవ్వడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.