Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!

టాలీవుడ్‌లో కంటెంట్‌కే ప్రాధాన్యతనిచ్చే యాక్టర్స్‌లో యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. కథ బాగుందంటే, అందులో తనది ఎలాంటి పాత్రైనా చేసేందుకు ఓకే అనేస్తాడు ఈ హీరో.....

Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!

Sree Vishnu Alluri Movie First Look Poster Looks Ferocious

Sree Vishnu: టాలీవుడ్‌లో కంటెంట్‌కే ప్రాధాన్యతనిచ్చే యాక్టర్స్‌లో యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. కథ బాగుందంటే, అందులో తనది ఎలాంటి పాత్రైనా చేసేందుకు ఓకే అనేస్తాడు ఈ హీరో. అయితే ఇటీవల ఈ హీరో చేస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ కావడంతో, శ్రీవిష్ణు నుండి మరోసారి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా రావాలని ఆడియెన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం అల్లూరి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Sree Vishnu : 14 ఏళ్లుగా స్నేహితులం.. ఇప్పటికి సినిమా కుదిరింది

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం శ్రీవిష్ణు బాడీ పెంచేసి భారీగా మేకోవర్ కూడా చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకు ‘అల్లూరి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ‘నిజాయితీకి మారుపేరు’ అనేది ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. ఈ సినిమా షూటింగ్‌లో ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

Sree Vishnu : ఈ తరం తెలుగుని మర్చిపోతున్నారు.. నా సినిమా టైటిల్స్ తెలుగులోనే ఉంటాయి

ఇక ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించిన ప్రదీప్ వర్మ ఈ సినిమా ద్వారా పోలీస్ పవర్ అంటే ఏమిటో జనాలకు మరోసారి చూపించాలని భావిస్తున్నాడట. పోలీస్ అంటే నిజాయితీకి మారుపేరు అని ప్రజలు నమ్మేలా తాను ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఆయన తెలిపారు. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. మరి సాలిడ్ పోస్టర్‌తో అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన శ్రీవిష్ణు ‘అల్లూరి’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.