Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్‌లో శ్రీ విష్ణు..

తాజాగా ఇవాళ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అల్లూరి' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో మొదటి సారి శ్రీవిష్ణు ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ తో పాటు మొదటి సారి పోలీస్ పాత్ర.............

Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్‌లో శ్రీ విష్ణు..

Alluri

Alluri :  ప్రయోగాత్మక సినిమాలతో అందర్నీ మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీ విష్ణు. ఎక్కువగా లవ్, ఎమోషనల్, అక్కడక్కడా మాస్ కంటెంట్స్ తో మెప్పించిన శ్రీ విష్ణు త్వరలో ఫుల్ మాస్ కంటెంట్ తో రాబోతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా లక్కీ మీడియా బ్యానర్ పై ‘అల్లూరి’ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇవాళ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో మొదటి సారి శ్రీవిష్ణు ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ తో పాటు మొదటి సారి పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయలుదేరాడురా అంటూ మొదలైన టీజర్ విప్లవానికి నాంది చైతన్యం, చైతన్యానికి పునాది నిజాయితీ,నిజాయితీకి మారుపేరు అల్లూరి అంటూ ఈ టీజర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో సాగింది. చివర్లో శ్రీ విష్ణు పవర్ ఫుల్ గా అల్లూరి సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ అని చెప్పడంతో టీజర్ ముగిసింది.

Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..

మొదటి సారి శ్రీ విష్ణు ఈ రేంజ్ లో మాస్ గా కనిపించడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం శ్రీ విష్ణు లుక్ కూడా మార్చుకున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాతో శ్రీ విష్ణు భారీ హిట్ కొడతారని ఆశిస్తున్నారు.