Sree Vishnu : ఈ తరం తెలుగుని మర్చిపోతున్నారు.. నా సినిమా టైటిల్స్ తెలుగులోనే ఉంటాయి

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ''తెలుగు టైటిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్‌ అన్నీ తెలుగులో పెట్టేందుకే ట్రై చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా...........

Sree Vishnu : ఈ తరం తెలుగుని మర్చిపోతున్నారు.. నా సినిమా టైటిల్స్ తెలుగులోనే ఉంటాయి

Sree Vishnu

Sree Vishnu :   యువ హీరో శ్రీ విష్ణు , అమృత అయ్యర్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘అర్జున ఫల్గుణ’ సినిమా డిసెంబర్ 31న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది. సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషపై తనకున్న ఇష్టాన్ని తెలిపాడు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ”తెలుగు టైటిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్‌ అన్నీ తెలుగులో పెట్టేందుకే ట్రై చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి తెలుగు పదాలు తెలుస్తాయి. ఈ తరం పిల్లలు తెలుగుని మర్చిపోతున్నారు. అర్జున ఫల్గుణ అనే పదాలు ఈ తరం పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను తెలుగు టైటిల్స్‌ని ఇష్టపడతాను’ అని అన్నారు హీరో శ్రీవిష్ణు.

Upasana : ఉపాసనకు దుబాయ్ నుంచి అరుదైన గౌరవం.. టాలీవుడ్ లో ఫస్ట్..

”అర్జున ఫల్గుణ అనేది మహాభారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్తారు. కానీ రాను రాను ఆ పేర్లన్నీ మర్చిపోయి అర్జున, ఫల్గుణ వరకే గుర్తుంచుకున్నారు. చిన్నప్పుడు ఉరుములు, మెరుపులు, పిడుగులు వస్తే అందరూ అర్జున, ఫల్గుణ అని అనుకోమనేవారు. అలాంటి పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది” అని ఆ పేర్లకి ఉన్న ప్రాముఖ్యతని కూడా తెలిపారు.