Bigg Boss 5 : సిరి కోసం ప్రియుడి ప్రమోషన్స్.. తన కష్టాలు మీకు తెలీవు.. సపోర్ట్ చేయండి..

సిరికి సపోర్ట్‌ చేస్తూ ఆమె ప్రియుడు, కాబోయే భర్త శ్రీహాన్‌ కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా సిరి గురించి మాట్లాడటానికి నిన్న ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాడు. నేను లైఫ్ లో...

Bigg Boss 5 : సిరి కోసం ప్రియుడి ప్రమోషన్స్.. తన కష్టాలు మీకు తెలీవు.. సపోర్ట్ చేయండి..

New Project

Bigg Boss 5 :  బిగ్ బాస్ అయిపోవస్తుండటంతో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట వాళ్ళ ఫ్యాన్స్ , ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు. ఈ క్రమంలో సిరికి సపోర్ట్‌ చేస్తూ ఆమె ప్రియుడు, కాబోయే భర్త శ్రీహాన్‌ కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా సిరి గురించి మాట్లాడటానికి నిన్న ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాడు.

Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్

లైవ్ లోకి వచ్చిన శ్రీహన్… ”నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చాను. అది కూడా సిరి ప్రొఫైల్‌ నుంచి లైవ్‌లోకి వచ్చాను తనకోసమే అని చెప్పాడు. తనకి టాప్‌ 5లో ఉండే అర్హత ఉంది. టాస్క్‌ల్లో వెనక్కి తగ్గకుండా ఆడుతుంది. సిరి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్తున్నప్పుడు ఎన్నోరోజులు ఉండదనుకున్నా, సిరి కూడా ఇన్నిరోజులు ఉంటుందని అనుకోలేదు. కానీ ఇన్నిరోజులు ఉందంటే ఆమె బాగా ఆడుతున్నట్టే కదా అని” అన్నాడు.

Bigg Boss 5 : బిగ్‌‍బాస్ లో హిట్ స్టార్.. ప్లాప్ స్టార్ ఎవరు??

ఇక షన్ను, సిరి విషయం గురించి మాట్లాడుతూ.. ”హౌస్‌లోకి వెళ్లాక చిన్నచిన్నవి జరుగుతుంటాయి, వాటన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది జడ్జ్‌ చేసి మాట్లాడుతుంటారు. అవన్నీ లైట్‌ తీసుకోండి. నా సిరి గురించి నాకు తెలుసు. పాజిటివ్‌ మైండ్‌తో ఆలోచించండి అని చెప్పాడు. ఇలా సిరిపై ఇష్టమొచ్చినట్టు వారాలు రాసి, వీడియోలు పెట్టి కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి సిరి అలాగైనా ఉపయోగపడుతుంది దానికి హ్యాపి అని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు”.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదు.. ఓన్లీ బ్రోమాన్స్ మాత్రమే : రాజమౌళి

ఇక సిరి కష్టాల గురించి మాట్లాడుతూ.. ”మేము హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సిరి ఉద్యోగం చేసేది. బస్‌లు మారుతూ ఆఫీస్‌కు వెళ్లేది. అప్పుడు ఇద్దరం కలుసుకోవడానికి చాలా కష్టపడేవాళ్లం. ఆ తర్వాత సిరికి వచ్చిన ఛాన్స్ అన్నిటిని ఉపయోగించుకుంది. టీవీ న్యూస్‌, షార్ట్ ఫిలిమ్స్, తర్వాత సీరియల్స్‌, ఇప్పుడు బిగ్‌బాస్‌.. తన ప్రయాణం చాలా కష్టాలతో కూడుకుంది. విజయం అనేది అంత ఈజీగా రాదు. మన సొసైటీలో అమ్మాయిలకి ఇంకా కష్టం. అమ్మాయిలు ఎక్కువ కష్టపడాలి. చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అంటూ ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ స్టేజ్ కి వచ్చింది సిరి. ఇంత కస్టపడి వచ్చిన సిరికి సపోర్ట్ చేద్దాం” అంటూ సిరి కోసం ప్రమోషన్ చేసాడు శ్రీహన్.