Akhanda : బాలయ్యతో 9 రోజులు దుమ్ములో ఫైట్ చేశా.. విలన్ అంటే అంత ఈజీ కాదు : శ్రీకాంత్

బాల‌కృష్ణ‌తో 'శ్రీరామరాజ్యం' సినిమాలో సోదరుడిగా నటించా. ఆయనతో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. మేమిద్ద‌రం అఖండలో ఓ ఫైట్ సీన్‌ను దాదాపు 9 రోజుల‌పాటు దుమ్ములో.........

10TV Telugu News

Akhanda :  కెరీర్ ఆరంభంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌తో మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎన్నో సినిమాలు చేసాడు శ్రీకాంత్. క్లాస్ మూవీలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీకాంత్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో విలన్ గా మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పవర్ ఫుల్ పాత్రను చేయబోతున్నాడు. అఖండ సినిమాలో బాలకృష్ణకి ఎదురెళ్ళే విలన్ గా శ్రీకాంత్ త్వరలో మన ముందుకి రాబోతున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేశారు.

Pooja Hegde: మందు ఎలా కలపాలో చూపించి .. ఆల్కహాల్‌తో స్టెప్పులేసి పూజా హెగ్డే..

శ్రీకాంత్ మాట్లాడుతూ… నేను విలన్ గా చేసిన ఒక సినిమా చూసి బోయపాటి నాకు ఫోన్ చేశారు. నువ్ ఇలా చిన్న చిన్న విలన్ పాత్రలు చేయకు. నేను నిన్ను మెయిన్ విలన్ గా చూడాలి అనుకుంటున్నాను అన్నారు. ఆ తర్వాత విలన్ గా చాలా ఆఫర్స్ వచ్చినా వద్దన్నాను. సడెన్‌గా ఒకరోజు బోయ‌పాటి ఫోన్ చేసి ‘అఖండ’ సినిమా గురించి చెప్పారు. బాలకృష్ణకి విలన్ గా చేయాలి అని అన్నారు. బాల‌కృష్ణ‌తో విల‌న్‌గా న‌టించ‌డం అంత ఈజీ కాదు. ‘అఖండ’లో వ‌ర‌ద‌రాజులు పాత్ర కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను అని చెప్పారు.

Harini Father : సింగర్‌ హరిణి తండ్రి మృతి కేసులో కొత్త ట్విస్ట్.. శరీరంపై కత్తిపోట్లు

బాల‌కృష్ణ‌తో ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సోదరుడిగా నటించా. ఆయనతో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. మేమిద్ద‌రం అఖండలో ఓ ఫైట్ సీన్‌ను దాదాపు 9 రోజుల‌పాటు దుమ్ములో చేశాం. అది చాలా కష్టంగా అనిపించింది. బాల‌కృష్ణ నన్ను చాలా ప్రోత్స‌హించారు. నన్ను సినిమాలో చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా చూడాల‌నుకున్నారు. అదే విష‌యాన్ని బోయ‌పాటికి కూడా చెప్పారు. అఖండ ట్రైల‌ర్ విడుద‌లైన తర్వాత నన్ను పొగుడుతూ చాలా కాల్స్ వస్తున్నాయన్నారు శ్రీకాంత్‌. ఇక సినిమా చూశాక నన్ను చూసి భయపడతారు అంత క్రూయల్ గా నా పాత్రని డిజైన్ చేశారు బోయపాటి అని తెలిపారు. ‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న విడుదల అవ్వనుంది.