‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవొచ్చు’..

‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవొచ్చు’..

Sreekaram Trailer: శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’.. కిషోర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ‘శ్రీకారం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Sreekaram

బాగా చదువుకున్న ఓ రైతు కొడుకు ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం వదులుకుని మరీ రైతుగా ఎందుకు మారాడు అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శర్వా విలేజ్ యువకుడిగా లేటెస్ట్ పద్ధతిలో ఫార్మింగ్ చేసే క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు.

Sreekaram

రావు రమేష్, సాయి కుమార్ పాత్రలు బాగున్నాయి. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. ‘పొలానికీ, పని ముట్టుకీ ఖాళీ లేకుండా సంవత్సరం మొత్తం ఏదో పంట చేతికొస్తూనే ఉండేలా చూద్దాం.. ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవొచ్చు’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.