NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి.. | Sreeleela as Daughter for Balakrishna in Anil Ravipudi Movie

NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు నేను చేసిన కామెడీ సినిమాలు కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేయబోతున్నాను. బాలకృష్ణ గారి మాస్, ఎలివేషన్, స్టైల్ ఏవి కూడా మిస్ అవ్వవు. ఇందులో బాలకృష్ణ.........

NBK 108 : బాలయ్య కూతురిగా ఆ హీరోయిన్ అంటూ.. బాలయ్యతో చేస్తున్న సినిమా కథ చెప్పేసిన అనిల్ రావిపూడి..

Blakrishna :  అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఓకే చేశారు బాలయ్య బాబు. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 27న విడుదల అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా కథ గురించి చెప్పాడు.

అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో అని తెలిసిందే. ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు నేను చేసిన కామెడీ సినిమాలు కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేయబోతున్నాను. బాలకృష్ణ గారి మాస్, ఎలివేషన్, స్టైల్ ఏవి కూడా మిస్ అవ్వవు. ఇందులో బాలకృష్ణ 50 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఇది తండ్రి కూతుళ్ళ మధ్య జరిగే కథ. ఇందులో బాలయ్య గారికి కూతురిగా శ్రీలీల కనిపించనుంది ఈ సినిమాలో. బాలకృష్ణ గారు ఈ సినిమాలో మరింత కొత్తగా కనిపిస్తారు” అంటూ సినిమా కథని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు అనిల్ రావిపూడి.

Young Heroins : ఒకే సెల్ఫీ ఫ్రేమ్‌లో నలుగురు బ్యూటీలు.. వైరల్ అవుతున్న ఫోటో..

మరి తండ్రి కూతుళ్ళ కథ అంటే మంచి భావోద్వేగాలు కచ్చితంగా ఉంటాయి. బాలయ్య బాబు ఆ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి. అంతే కాకుండా బాలకృష్ణతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ ఇంకా మొదలు పెట్టలేదని, F3 రిలీజ్ అయ్యాక ఆ సినిమా స్క్రిప్ట్ మొదలుపెడతానని అన్నారు. నేను స్క్రిప్ట్ రెడీ చేసేలోపు బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా కూడా పూర్తవుతుంది అని చెప్పారు అనిల్ రావిపూడి.

 

×