Sreeleela : ఒక్క సినిమాతో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న శ్రీలీల..

అందం, అభినయం కలగలిసిన తెలుగమ్మాయి శ్రీలీల. ఆమె హీరోయిన్ గా తెలుగులో రిలీజ్ అయింది ఒకే ఒక్క సినిమా పెళ్లి సందడి. అదీ యావరేజ్ సినిమానే. అయినా ఆ తర్వాత వరసగా ఆఫర్లు...............

Sreeleela : ఒక్క సినిమాతో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న శ్రీలీల..

Sreeleela

Sreeleela :  అందం, అభినయం కలగలిసిన తెలుగమ్మాయి శ్రీలీల. ఆమె హీరోయిన్ గా తెలుగులో రిలీజ్ అయింది ఒకే ఒక్క సినిమా పెళ్లి సందడి. అదీ యావరేజ్ సినిమానే. అయినా ఆ తర్వాత వరసగా ఆఫర్లు కొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా అరడజను సినిమాలున్నాయి. శ్రీలీల తెలుగు ఫ్యామిలీ అమ్మాయే. కానీ పెళ్లి సందడి కన్నా ముందు రెండు కన్నడ సినిమాల్లో నటించింది. ఆమె మొదటి సినిమా కిస్ కన్నడలో సక్సెస్ సాధించింది. తర్వాత భరాతే సినిమాకు కూడా పాజిటివ్ రిజల్టే వచ్చింది.

ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందడి నిరాశ పరిచినా మాస్ రాజా రవితేజ సినిమా ‘ధమాకా’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది స్టన్నింగ్ బ్యూటి శ్రీలీల. ధమాకా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ కాకుండానే జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కంబైన్డ్ గా నిర్మిస్తున్న ‘అనగనగా ఒకరాజు’ సినిమాలో శ్రీలీలనే హీరో్యిన్. ఆ తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి నటిస్తున్న వారాహి చలన చిత్రం బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్. ఈ సినిమా తెలుగు – కన్నడలో రిలీజ్ కానుంది.

Sankranthi Movies : అప్పుడే సంక్రాంతి పోటీకి సిద్దమైన హీరోలు..

ప్రస్తుతం ధృవ సర్జా సరసన ‘దుబారి’ సినిమాలో నటిస్తుంది శ్రీలీల. ఈ సినిమా సంవత్సరం చివర్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలేవీ రిలీజ్ కాకుండానే మరో ఛాన్స్ కూడా పట్టేసింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఇలా తెలుగులో ఒక్క సినిమా చేసి, ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస ఛాన్సులు కొట్టేస్తుంది శ్రీలీల. దాదాపు శ్రీలీల చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి ప్రస్తుతం.