Sreeleela: బాలయ్య సినిమాలో అడుగుపెట్టిన శ్రీలీల

యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా శ్రీలీల మాస్ రాజా రవితేజ సరసన ‘ధమాకా’ మూవీలో నటించగా, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేగాక, వంద కోట్ల వసూళ్లతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Sreeleela: బాలయ్య సినిమాలో అడుగుపెట్టిన శ్రీలీల

Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా శ్రీలీల మాస్ రాజా రవితేజ సరసన ‘ధమాకా’ మూవీలో నటించగా, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేగాక, వంద కోట్ల వసూళ్లతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

NBK108: అనిల్ రావిపూడి మూవీ కోసమే బాలయ్య గడ్డం పెంచుతున్నాడా..?

ఇక ఈ బ్యూటీ పర్ఫార్మెన్స్‌కు అందరూ ఇంప్రెస్ కావడటంతో, వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు శ్రీలీలను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకుంటుండగా, సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ మూవీలోనూ శ్రీలీల నటిస్తుందనే టాక్ వినిపిస్తూ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 108వ చిత్రంగా వస్తుండగా, ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా తాజాగా ఈ సినిమాలో శ్రీలీల అడుగుపెట్టినట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Sreeleela: ధమాకా దెబ్బకు ‘పవర్’ఫుల్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల..?

ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో ఈ బ్యూటీ నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, బాలయ్య ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తాడని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.