Sreeleela: పెళ్లిసందD ఎఫెక్ట్.. హీరోయిన్‌కు ధమాకా.. హీరోకు మాత్రం జీరో!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ బ్యూటీగా శ్రీలీల మారిపోయింది. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే అదే సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ కొడుకు రోషన్‌కు ఆ సినిమా పెద్దగా కలిసిరాలేదు.

Sreeleela: పెళ్లిసందD ఎఫెక్ట్.. హీరోయిన్‌కు ధమాకా.. హీరోకు మాత్రం జీరో!

Sreeleela Successful But Not Roshan After Pelli Sandadi

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ బ్యూటీగా శ్రీలీల మారిపోయింది. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే అదే సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ కొడుకు రోషన్‌కు ఆ సినిమా పెద్దగా కలిసిరాలేదు.

Sreeleela: మాస్ రాజాతో పాటు శ్రీలీల కటౌట్.. ధమాకా క్రేజ్ మామూలుగా లేదుగా!

అనుకున్న స్థాయిలో ఆ సినిమా హిట్ కాకపోవడంతో, రోషన్ ఆ తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటనే విషయాన్ని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ హీరో కెరీర్ డైలమాలో పడిపోయింది. హీరోగా తొలిసినిమా సక్సెస్ కాకపోతే, వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ, రోషన్ ఎందుకో సైలెంట్ అయిపోయాడు. కానీ శ్రీలీల మాత్రం పెళ్లిసందD ఫెయిల్యూర్ తరువాత మాస్ రాజా రవితేజతో ధమాకా సినిమాలో నటించింది.

Sreeleela : స్పెయిన్‌లో షూటింగ్‌కి వెళ్లి.. బ్యాగ్ పోగొట్టుకున్న హీరోయిన్

ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది. దీంతో ఈ సినిమాలో అమ్మడి పాత్ర, ఆమె అందానికి అభిమానులు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇక ఈ బ్యూటీ తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో బాలకృష్ణతో కలిసి చేస్తుంది. ఇలా పెళ్లిసందD ఎఫెక్ట్, శ్రీలీలకు బాగా కలిసొస్తే.. రోషన్‌కు మాత్రం జీరో సక్సెస్‌ను అందించింది.