Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో యంగ్ సెన్సేషన్.. ఆమె ప్లేస్‌లోనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు.

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో యంగ్ సెన్సేషన్.. ఆమె ప్లేస్‌లోనా..?

Sreeleela To Cast In Pawan Kalyan Ustad Bhagat Singh

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు.

Pawan Kalyan : చరణ్ విజయాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్రెస్ నోట్..

ఈ సినిమాకు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేసింది. ఈ సినిమాలో పవన్‌ను మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో చూపించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో తెలుసా?

అయితే ఈ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. కాగా, గతంలో ఈ పాత్రలో అమీ జాక్సన్ నటించబోతుందని వార్తలు రాగా, ఇప్పుడు ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలను తీసుకుంటున్నారనే మరో వార్త కూడా నెట్టింట వినిపిస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.