Sreemukhi : ‘జాతిరత్నాలు’తో శ్రీముఖి రీఎంట్రీ

 'పటాస్' షోతో యాంకర్ గా అందర్నీ అలరించిన శ్రీముఖి ఆ తర్వాత రెగ్యులర్ గా షోలు చేయలేకపోతోంది. కొన్ని షోలు చేసినా అవి మూన్నాళ్ళ ముచ్చటగానే నిలిచిపోతున్నాయి. కొన్ని ఈవెంట్స్ లో......

Sreemukhi : ‘జాతిరత్నాలు’తో శ్రీముఖి రీఎంట్రీ

Jathi Rathnalu

 

Sreemukhi :  ‘పటాస్’ షోతో యాంకర్ గా అందర్నీ అలరించిన శ్రీముఖి ఆ తర్వాత రెగ్యులర్ గా షోలు చేయలేకపోతోంది. కొన్ని షోలు చేసినా అవి మూన్నాళ్ళ ముచ్చటగానే నిలిచిపోతున్నాయి. కొన్ని ఈవెంట్స్ లో అప్పుడప్పుడు యాంకర్ గా అన్ని ఛానల్స్ లోను కనిపిస్తుంది. అయితే ఫుల్ టైం యాంకర్ గా ఒక షో చేసి చాలా రోజులవుతుంది శ్రీముఖికి. తాజాగా శ్రీముఖి మరో కొత్త షోతో యాంకర్ గా రాబోతుంది.

Niharika Konidela : ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక.. కారణం ఏంటి??

ఓ ఛానల్ లో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఓ కొత్త షో రాబోతుంది. ‘జాతిరత్నాలు’ అనే పేరుతో ఈ షో రాబోతుంది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో రానున్న ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించనుంది. ఈ షో త్వరలో ప్రారంభమవనుంది. తాజాగా ఈ షో ప్రోమోని విడుదల చేశారు. మరోసారి శ్రీముఖి ఫుల్ టైం యాంకర్ గా ‘జాతిరత్నాలు’ షోతో బిజీగా మారనుంది. మరి ఈ షో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.