Sreemukhi : అవినాష్, భానుశ్రీలతో కలిసి అర్ధరాత్రి న్యూ ఇయర్ రచ్చ రచ్చ చేసిన శ్రీముఖి

బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి, జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్లిన అవినాష్ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. వీరిద్దరూ చాలా సార్లు కలిసి.......

Sreemukhi : అవినాష్, భానుశ్రీలతో కలిసి అర్ధరాత్రి న్యూ ఇయర్ రచ్చ రచ్చ చేసిన శ్రీముఖి

Sreemukhi

Sreemukhi :   సెలబ్రిటీలంతా న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు అంతా న్యూ ఇయర్ వేడుకలతో హల్ చల్ చేశారు. రాత్రంతా న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకొని ఆ ఫోటోలని, వీడియోల్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానులు తమ ఫేవరేట్ సెలబ్రిటీలు పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు.

Mahesh Babu : దుబాయ్‌లో నైట్ డిన్నర్‌తో న్యూ ఇయర్ చేసుకున్న మహేష్

ఇక బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి, జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్లిన అవినాష్ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. వీరిద్దరూ చాలా సార్లు కలిసి పార్టీలు చేసుకున్నారు. అలాగే మరో యాంకర్, ఆర్టిస్ట్ భానుశ్రీ కూడా అవినాష్ కి క్లోజ్. దీంతో నిన్న రాత్రి అవినాష్, శ్రీముఖి, భానుశ్రీ కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా చేసుకున్నారు. కేక్ కట్ చేసి, డ్యాన్సులు వేసి, ఫోటోలు, వీడియోలతో రచ్చ చేశారు. వీళ్ళతో పాటు శ్రీముఖి తమ్ముడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. వీటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.