Sreenu Vaitla: అఫీషియల్.. మ్యాచో స్టార్‌తో ఫిక్స్ చేసిన శ్రీను వైట్ల!

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కించిన టాప్ పొజిషన్‌లో ఉన్న దర్శఖుడు శ్రీను వైట్ల, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో చతికలబడ్డాడు. చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన శ్రీను వైట్ల, ఎట్టకేలకు తనకు హిట్ ఇచ్చే హీరో దొరికినట్లుగా తాజాగా అనౌన్స్ చేశాడు.

Sreenu Vaitla: అఫీషియల్.. మ్యాచో స్టార్‌తో ఫిక్స్ చేసిన శ్రీను వైట్ల!

Sreenu Vaitla Announces His Next Movie With Gopichand

Sreenu Vaitla: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కించిన టాప్ పొజిషన్‌లో ఉన్న దర్శఖుడు శ్రీను వైట్ల, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో చతికలబడ్డాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. దీంతో శ్రీను వైట్ల తిరిగి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అయ్యి తన ట్యాలెంట్ ఏమిటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Gopichand: ఫ్లాప్ డైరెక్టర్‌తో గోపీచంద్ సినిమా.. రిస్క్ అవసరమా అంటోన్న ఫ్యాన్స్!

ఈ క్రమంలో చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన శ్రీను వైట్ల, ఎట్టకేలకు తనకు హిట్ ఇచ్చే హీరో దొరికినట్లుగా తాజాగా అనౌన్స్ చేశాడు. తన నెక్ట్స్ మూవీని మ్యాచో స్టార్ గోపీచంద్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లుగా దసరా పండుగ సందర్భంగా అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్. సీటీమార్, పక్కా కమర్షియల్ చిత్రాలతో మంచి ఫాంలోకి వచ్చిన గోపీచంద్‌తో సినిమా చేస్తే, తనకు ఖచ్చితంగా హిట్ పడుతుందని ఈ డైరెక్టర్ భావిస్తున్నాడట. అంతేగాక, తన కథతో గోపీచంద్‌ను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయిన శ్రీను వైట్ల, ఈ సినిమాతో గ్యారెంటీగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..

ఇక ఈ సినిమాకు గోపీమోహన్ కూడా వర్క్ చేస్తున్నాడని శ్రీను వైట్ల ప్రకటించాడు. దీంతో చాలా కాలం తరువాత శ్రీను వైట్ల, గోపీ మోహన్ కలిసి పనిచేస్తుండటంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయని.. ఇప్పుడు ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి శ్రీను వైట్లతో గోపీచంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.