Bigg Boss 5 : ప్రియాంక వల్ల బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్.. హౌస్‌లో ఉంటాడా??

శ్రీరామ్ ఎక్కువ సేపు ఐస్ వాటర్ లో ఉండటంతో కాళ్ళు బాగా తిమ్మిరెక్కాయి. దీంతో రాత్రి నిద్ర పోకుండా కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ప్రియాంక... శ్రీరామ్ కాళ్లకు అర్ధరాత్రి.......

Bigg Boss 5 : ప్రియాంక వల్ల బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్.. హౌస్‌లో ఉంటాడా??

Sreeram

Bigg Boss 5 :  బిగ్ బాస్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే టాస్కులు జరుగుతున్నాయి. బిగ్‌బాస్‌ షోలో ఇప్పుడు బాగా ముఖ్యమైన ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌ జరుగుతుంది. ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్ కి అర్హత సాధించినట్లే. ఈ టాస్క్ లో భాగంగా మొదటి లెవల్‌లో ఐస్‌ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్‌లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే పక్కవారి బకెట్‌లోని బాల్స్‌ను తీసుకోవాలి. అయితే ఈ టాస్క్ లో ఐస్ వాటర్ లో కాళ్ళు పెట్టడం వల్ల కాళ్ళు అన్ని తిమ్మిరి ఎక్కిపోయాయి అందరికి.

Allu Arjun : ఏపీ వరద భాదితులకు అల్లు అర్జున్ సాయం

ఐస్‌ వాటర్‌ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని ముందే వార్నింగ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. శ్రీరామ్ ఎక్కువ సేపు ఐస్ వాటర్ లో ఉండటంతో కాళ్ళు బాగా తిమ్మిరెక్కాయి. దీంతో రాత్రి నిద్ర పోకుండా కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ప్రియాంక… శ్రీరామ్ కాళ్లకు అర్ధరాత్రి జండూబామ్‌ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్‌ చేసింది. దీంతో అతడి కాళ్ళు వాచి నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్‌ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు.

Akhanda Review: అఘోరాగా ఉగ్రరూపం.. ఊర మాస్ బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

ఐస్‌ వాటర్‌లో నుంచి బయటకు వచ్చాక కాళ్లపై వేడినీళ్లు పోయడం హానికరమని బిగ్ బాస్ చెప్పినప్పటికీ ప్రియాంక శ్రీరామ్‌కు అలా చేసిందేంటని మానస్‌, కాజల్‌ సీరియస్ అయ్యారు. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని ప్రియాంక శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్‌ కు రెండు అరికాళ్లకు కట్టు కట్టడంతో బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత సన్నీ జోకర్‌లా రెడీ అయి శ్రీరామ్‌ను నవ్వించాడు. అతడు నడవలేని స్థితిలో ఉండటంతో బెడ్‌పైనే ఉండి గేమ్‌ ఆడగా మిగతా అందరు మాత్రం గార్డెన్‌ ఏరియాలో ఉండి ఆడారు.

Sirivennela : స్వర్గంలో కలుద్దాం.. త్వరలో నేనూ వస్తా.. ఆర్జీవీ ట్వీట్

కానీ ఇలా బెడ్ పైనే ఉండి టాస్కులు పూర్తిగా ఆడలేడు. మరి ఈ నొప్పి త్వరగా తగ్గిపోతుందా లేక శ్రీరామ్ కూడా జెస్సి లాగా హెల్త్ ప్రాబ్లమ్ తో బయటకి వెళ్ళిపోతాడా చూడాలి. ఇక సోషల్ మీడియాలో శ్రీరామ్ ఫ్యాన్స్ నీ వల్లే శ్రీరామ్ కి ఈ గతి పట్టిందని ప్రియాంకని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.