AHA : తెలుగు ఇండియన్ ఐడల్ లో రేవంత్ అవుట్.. శ్రీరామచంద్ర ఇన్

 ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో 'తెలుగు ఇండియన్‌ ఐడల్' ప్రోగ్రాం రాబోతుంది. ఇండియన్ ఐడల్ కి ధీటుగా ఈ ప్రోగ్రాం ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి.........

AHA : తెలుగు ఇండియన్ ఐడల్ లో రేవంత్ అవుట్.. శ్రీరామచంద్ర ఇన్

Sreeramachanra

AHA :   ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘తెలుగు ఇండియన్‌ ఐడల్’ ప్రోగ్రాం రాబోతుంది. ఇండియన్ ఐడల్ కి ధీటుగా ఈ ప్రోగ్రాం ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్‌ చేసింది. ఇండియన్ ఐడల్ మాదిరిగానే కేవలం తెలుగు సింగర్స్ కోసం తెలుగు ఇండియన్ ఐడల్ షో చేయనుంది. ఇటీవలే ఈ షోకి ఆడిషన్స్‌ కూడా నిర్వహించారు. అయితే ఈ షోకి గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు అని అనౌన్స్ చేశారు. పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ని హోస్ట్ గా తీసేసి శ్రీరామచంద్రని తీసుకున్నారు.

శ్రీరామచంద్ర మొన్నటి వరకు ఇండియన్ ఐడల్ గా, పాపులర్‌ సింగర్‌ గా అందరికి తెలుసు. కానీ తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొనడంతో మరింత పాపులర్‌ అయ్యాడు. బిగ్ బాస్ లో టాప్ 3లో ఉండి తెలుగు అభిమానులని సంపాదించుకున్నాడు. దీంతో శ్రీరామచంద్ర ఇప్పుడు తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఆ ఫామ్ ని ఆహాకి ఉపయోగించుకోవాలని తెలుగు ఇండియన్ ఐడల్ లో హోస్ట్ గా రేవంత్ ని తప్పించి శ్రీరామచంద్రని తీసుకున్నారు.

Dhanush : రజినీకాంత్ బయోపిక్ లో ధనుష్

ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు ఆహా మేకర్స్‌. ఇప్పటిదాకా సింగర్ గా అదరగొట్టిన శ్రీరామచంద్ర తెలుగు ఇండియన్‌ ఐడల్‌ లో హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.