SreeReddy : షణ్ముఖ్ చేస్తే తప్పు? నువ్వు చేస్తే కరెక్టా?.. షన్ను దీపు బ్రేకప్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

శ్రీరెడ్డి దీప్తిని ఉద్దేశించి.. ''దీప్తి నువ్వు షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్‌బాస్‌లో జరిగినదానికి షణ్ముఖ్‌కి.......

SreeReddy : షణ్ముఖ్ చేస్తే తప్పు? నువ్వు చేస్తే కరెక్టా?.. షన్ను దీపు బ్రేకప్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

Sree Reddy

SreeReddy :  యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్, దీప్తి సునైనా గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు చెప్పారు. వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోను నటించారు. ఈ జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. గతంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా విడిపోతున్నట్టు దీప్తి తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టింది. దానికి రిప్లైగా షణ్ముఖ్ కూడా విడిపోతున్నాము అంటూ పోస్ట్ పెట్టాడు.

ఇక అప్పట్నుంచి వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటి అని, వీళ్ళు కలిసి ఉండాలని సోషల్ మీడియాలో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రకంగా వీరిద్దరూ విడిపోవడానికి బిగ్ బాస్ లో సిరి షణ్ముఖ్ ల బంధమే అని టాక్ వినిపిస్తుంది. దీనిపై చాలా మంది అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట విడిపోవడం పై శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వీళ్ళ బ్రేకప్ గురించి మాట్లాడింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ…… ”షణ్ముఖ్‌-దీప్తిలది చూడచక్కని జంట. అలాంటి వారు బ్రేకప్‌ చెప్పుకోడం అందిరితో పాటు నన్ను కూడా కలచివేసింది. మనం ఎన్ని చేసినా భారతీయులమనేది మరిచిపోవద్దు. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదు. టెక్నాలజీ పరంగా మీరు డెవలప్‌ అవ్వండి. కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటీవ్‌ అయిపోతున్నారు. తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకు చాలా తక్కువగా ఉంది. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం” అని అంది.

Radhe Shyam: రాధే శ్యామ్ దర్శకుడి ట్వీట్ దుమారం!

ఇక దీప్తిని ఉద్దేశించి.. ”దీప్తి నువ్వు షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు. బిగ్‌బాస్‌లో జరిగినదానికి షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పావని క్లియర్‌గా అర్ధం అవుతుంది. మరి నువ్వు బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నావో, మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం. ఇది లవ్ ఏమో అని జనాలకి అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకూ వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా? షణ్ముఖ్‌తో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పింది. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ని వదిలేసేదా? మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పుల్ని ఒకరు క్షమించుకోవాలి. ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి” అని శ్రీరెడ్డి చెప్పింది.

Pushpa: యూట్యూబ్ టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో పుష్ప

ఇక వాళ్ళు వేసుకున్న టాటూల గురించి మాట్లాడుతూ.. ”పెళ్లికి ముందు టాటూలు వేయించుకున్న చాలా మంది విడిపోయారు. పెళ్లైన తరువాత వంద వేషాలు వేయండి. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి”అని శ్రీరెడ్డి దీప్తిని ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. ఇలా శ్రీరెడ్డి షణ్ముఖ్ కి సపోర్ట్ చేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.