సిల్క్ స్మిత బయోపిక్‌లో శ్రీ రెడ్డి!

సిల్క్ స్మిత బయోపిక్‌లో శ్రీ రెడ్డి!

Sri Reddy: శ్రీ రెడ్డి.. కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు.. శ్రీ రెడ్డి అంటేనే కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రెస్.. కొంత కాలంగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. ఆమె పెట్టే పోస్టుల గురించి, కామెంట్స్ గురించి, లైవ్‌లో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే.

రీసెంట్‌గా తన కొత్త సినిమా అనౌన్స్ చేసింది శ్రీ రెడ్డి. దివంగత నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్‌ రోల్‌ చెయ్యబోతోంది. సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాను దిగ్గజ నటి సిల్క్‌ స్మిత పాత్ర చేస్తున్నానని, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పుకొచ్చింది..

అలాగే సిల్క్ స్మితను పోలిన ఫొటో తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని చెప్పింది శ్రీ రెడ్డి. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌ను మధు డైరెక్ట్ చేస్తున్నారు.

Sri Reddy