40 ఏళ్ల – ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’

1979 సెప్టెంబర్ 28న విడుదలైన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’.. 2019 సెప్టెంబర్ 28 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 11:18 AM IST
40 ఏళ్ల – ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’

1979 సెప్టెంబర్ 28న విడుదలైన ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’.. 2019 సెప్టెంబర్ 28 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’.. 1979 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం 2019 సెప్టెంబర్ 28 నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్.. వెంకటేశ్వర స్వామిగా ప్రేక్షకులను పరవశింపచేశారు.

పద్మావతిగా జయప్రద, అలివేలు మంగగా జయసుధ, నారద మహర్షిగా నందమూరి బాలకృష్ణ అలరించారు. హథీరామ్ బాబాజీగా గుమ్మడి, ముస్లిం ప్రవక్తగా ముక్కామల, ఆకాశ రాజుగా మిక్కిలినేని, భ్రిగు మహర్షిగా ధూళిపాల, గోపన్నగా అల్లు రామలింగయ్య, వకుల దేవిగా అంజలీ దేవి, భూదేవిగా సంగీత, పార్వతిగా మంజు భార్గవి తదితరులు నటించారు. డి.వి.నరసరాజు మాటలు రాయగా, పెండ్యాల నాగేశ్వర రావు సంగీతం సమకూర్చారు.

ఎమ్.ఏ.రెహమాన్ కెమెరా, జి.డి.జోషి, ఎన్.ఎస్.ప్రసాద్ ఎడిటింగ్ అందించారు. దేవులపల్లి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మహమ్మద్ రఫీ, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది రమేష్ తదితరులు గాత్రదానం చేశారు. వెంపటి నృత్యాలు సమకుర్చారు. రాముడిగా, కృష్ణుడిగానే కాకుండా పలు చిత్రాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్  శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం చిత్రంలో ఏడుకొండల వాడిగానూ అలరించి, ఇటువంటి పాత్రలు పోషించాలంటే ఆయన వల్లే అవుతుంది అని నిరూపించారు.