Arjuna Phalguna: ఈ ఏడాది మూడవ సినిమాతో గ్రాండ్ సెండాఫ్ చెప్పిన శ్రీవిష్ణు!

2021 లాస్ట్ కి వచ్చేసింది. ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండాఫ్ ఇవ్వడానికి టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రెడీ అయ్యారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే శ్రీవిష్ణు.

Arjuna Phalguna: ఈ ఏడాది మూడవ సినిమాతో గ్రాండ్ సెండాఫ్ చెప్పిన శ్రీవిష్ణు!

Arjuna Phalguna

Arjuna Phalguna: 2021 లాస్ట్ కి వచ్చేసింది. ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండాఫ్ ఇవ్వడానికి టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రెడీ అయ్యారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే శ్రీవిష్ణు… ఈ సారి కూడా సరికొత్త పాయింట్ తో డిసెంబర్ 31న ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. తన మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీవిష్ణు. హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయినా.. సరికొత్త కథలతో ఆడియన్స్ ని మాత్రం ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు శ్రీవిష్ణు.

Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?

ఈసారి కూడా ఇంటెన్స్ యాక్టింగ్ తో, అంతకంటే మించిన ఎమోషన్స్ తో తెరకెక్కిన అర్జున-ఫల్గుణ మూవీలో ఎన్టీఆర్ వీరాభిమానిగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. శ్రీవిష్ణు.. అమృత అయ్యర్ జంటగా తేజమార్ని డైరెక్ట్ చేసిన మూవీ అర్జున ఫల్గుణ డిసెంబర్ 31న ధియేటర్లోకొచ్చింది. రియల్ ఇన్సిండెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ ఇంట్రస్టింగ్ మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ లో పక్కా పల్లెటూరి ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కామెడీ యాక్షన్, ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా జస్ట్ 55 రోజుల్లోనే కంప్లీట్ చేశారు టీమ్.

Oo Antava Mava: సామ్ ఊ అంటావా మావా.. 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్!

శ్రీవిష్ణు.. ఎప్పుడూ హీరో సెంట్రిక్ సినిమాలు కాకుండా స్టోరీ డ్రివెన్ సినిమాలు చేస్తూ.. కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తున్నారు. తేజమార్నికి కూడా ఇది రెండో సినిమా. ఊర్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఐదుగురు ఫ్రెండ్స్.. అనుకోకుండా ఓ సమస్య లో ఇరుక్కుని ఎలా బయటపడతారనేది స్టోరీ. విష్ణు ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్న మూడో సినిమా అర్జున-ఫల్గుణ. ఆల్రెడీ గాలిసంపత్, రాజరాజచోర సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీవిష్ణు.. ఇప్పుడు డిసెంబర్ 31న మూడో సినిమా రిలీజ్ చేసి 2021కి గ్రాండ్ సెండాఫ్ చెప్పబోతున్నారు.