Srikanth : నేను విడాకులు తీసుకోలేదని ప్రూవ్ చేయడానికి ఎక్కడికెళ్లినా నా భార్యని కూడా తీసుకెళ్లాల్సి వస్తోంది..
శ్రీకాంత్ సోషల్ మీడియాలో వచ్చే అబద్దపు వార్తలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు యూట్యూబ్ లో థంబ్‌నైల్స్ పెడుతున్నారు. కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. ఓ సారి అయితే...............

Srikanth comments on fake news about his divorce
Srikanth : ఇటీవల సోషల్ మీడియాల్లో, యూట్యూబ్ లో ఫేక్ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అందులోను సెలబ్రిటీల మీద అయితే మరీ ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఎవరో సెలబ్రిటీలు మరణించినట్టు, ఎవరో విడాకులు తీసుకున్నట్టు.. ఇలా ఇష్టమొచ్చినట్టు వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కొంతమంది సెలబ్రిటీలు ఫైర్ అవుతుంటే, కొంతమంది ఏమో అవి నిజం కాదు అని చెప్పాల్సి వస్తోంది.
ఇటీవల కొన్ని రోజుల క్రితం శ్రీకాంత్ తన భార్య ఊహతో విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అప్పుడే శ్రీకాంత్ మీడియా ముందుకి వచ్చి అదంతా అబద్దం, మేము బాగానే ఉన్నాం అని ఫేక్ వార్తలపై ఫైర్ అయ్యాడు. తాజాగా మరోసారి మీడియా ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
శ్రీకాంత్ సోషల్ మీడియాలో వచ్చే అబద్దపు వార్తలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు యూట్యూబ్ లో థంబ్‌నైల్స్ పెడుతున్నారు. కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. ఓ సారి అయితే నేను మరణించినట్టు పెట్టేసారు. ఇలాంటివి మేము తట్టుకోగలం. కానీ మా కుటుంబ సభ్యులు చూస్తే, మా అమ్మ పెద్దావిడ ఆవిడ చూస్తే తట్టుకోగలదా, ఆ షాకింగ్ లో ఏమన్నా జరిగితే. ఇలాంటి ఫేక్ వార్తలు రాసేవాళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా ఫలితం ఉండదు. వాళ్ళే వ్యక్తిగతంగా మారాలి. కొన్నాళ్ల క్రితం నేను విడాకులు తీసుకుంటున్నట్టు వదంతులు పుట్టించారు. దాని వల్ల ఏదైనా ఈవెంట్ కి వెళ్తే నా భార్యని కూడా తీసుకెళ్లి ప్రూవ్ చేయాల్సి వస్తోంది. నా భార్యకి ఏమో సినిమా ఈవెంట్స్ కి రావడం ఇష్టం లేదు. ఈ విషయం సినిమా వాళ్లకు తెలుసు, కానీ బయట వాళ్లేమో ఆమె రావట్లేదని మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని రాసేస్తున్నారు. ఇటీవల కోట శ్రీనివాసరావు గారిపై మరణించినట్లు రాసేశారు. అది చూసి షాక్ అయ్యా. వాళ్లే మారాలి, ఇలాంటివి రాయకుండా చూసుకోవాలి అని అన్నారు.