Roshan: పేరు మార్చుకున్న శ్రీకాంత్ కొడుకు.. ఇకనైనా కలిసొచ్చేనా?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు. మరికొంతమంది జాతకాలు.. న్యూమరాలజీ లాంటి వాటిని కూడా బలంగా నమ్ముతారు. గతంలో తమన్నా, లక్ష్మీరాయ్ లాంటి హీరోయిన్లు.. సాయిధరమ్..

Roshan: పేరు మార్చుకున్న శ్రీకాంత్ కొడుకు.. ఇకనైనా కలిసొచ్చేనా?

Roshan

Roshan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు. మరికొంతమంది జాతకాలు.. న్యూమరాలజీ లాంటి వాటిని కూడా బలంగా నమ్ముతారు. గతంలో తమన్నా, లక్ష్మీరాయ్ లాంటి హీరోయిన్లు.. సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు న్యూమరాలజీ ప్రకారం పేరులో కొత్త అక్షరాలను జోడించి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాగా.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో వారసుడు.. యంగ్ హీరో రోషన్ కూడా అదే పని చేశాడు.

Roshan : రెండో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన రోషన్..

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మలా కాన్వెంట్ తో ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఈ మధ్యనే పెళ్లి సందD సినిమాతో అలరించాడు. అయితే, ఇవేవీ రోషన్ ను ఫ్యూచర్ స్టార్ ను చేసే సినిమాలుగా ఉపయోగపడలేదు. తండ్రి శ్రీకాంత్ కూడా రోషన్ ను ఎలాగైనా స్టార్ హీరోను చేయాలని తన సర్కిల్స్ ను ఉపయోగించి మంచి సినిమాలను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు.

Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు

ఈలోగా ఇప్పుడు రోషన్ మరో సినిమాను కూడా మొదలు పెట్టాడు. అయితే ఈసారి న్యూమరాలజీ ప్రకారం పేరులో మార్పులు చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటి వరకు తన పేరు roshan కాగా.. ఇప్పుడు పేరు మరో n అక్షరాన్ని జోడించి roshannగా మార్చుకున్నాడు. మరి ఈ పేరులో మార్పు అయినా తనకి కలిసి వస్తుందో లేదో చూడాలి.