Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

బిగ్ బ్రదర్ అనే ఇతర దేశం నుండి తెచ్చుకున్న ఓ రియాలిటీ షోకు కాస్త మార్పులు చేర్పులు చేసి మన దగ్గర బిగ్ బాస్ అంటూ మొదలైన సంగతి తెలిసిందే. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా..

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

Big Boss 5

Big Boss 5: బిగ్ బ్రదర్ అనే ఇతర దేశం నుండి తెచ్చుకున్న ఓ రియాలిటీ షోకు కాస్త మార్పులు చేర్పులు చేసి మన దగ్గర బిగ్ బాస్ అంటూ మొదలైన సంగతి తెలిసిందే. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా అవతరించిన బిగ్ బాస్ తెలుగులోనే కాకుండా ఇండియాలో అన్ని భాషలలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ షో తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా ప్రస్తుతం ఐదవ సీజన్స్ ఐదవ వారానికి చేరుకుంది. అయితే, బిగ్ బాస్ పేరుకు తగ్గట్లుగా ఈ సీజన్ రక్తికట్టించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?

వీకెండ్ లో నాగ్ వచ్చే రెండు రోజులు మాత్రం షో చూసే వాళ్ళు ఎక్కువ మందే ఉండగా మిగతా ఐదు రోజులలో ఈ షోకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. షో నిర్వాహకులు, క్రియేటివిటీ టీం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఈ షోను ప్లాన్ చేయలేకపోతున్నట్లుగా విమర్శలు వినిపించాయి. కాగా, ఈ సీజన్ లో ఆకట్టుకొనే కంటెస్టెంట్లు.. వారి మధ్య అట్రాక్షన్, ప్రేమలు లేకపోవడం కూడా ఒక మైనస్ గా షో నిర్వాహకుల వరకు వెళ్లినట్లుంది. అందుకే ఉన్న వాళ్ళలో కాస్త డోస్ పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గత రెండు వారాలుగా ప్రయత్నాలు జరిగినా పెద్దగా అది వర్క్ అవుట్ కాలేదు.

Acharya: చిరు ఈ ఏడాది వస్తాడా.. లేక వచ్చే ఏడాదికి వెళ్తాడా?

అయితే.. ఈసారి శ్రీరామచంద్ర తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకి తీశాడు. అసలే ఇంట్లోనే హాట్ బ్యూటీగా పేరున్న హమీదా వెంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న శ్రీరామ్ మొన్నటి వరకు హగ్గులు, ఫ్లైయింగ్ కిస్సులతో సరిపెడితే ఈసారి ఏకంగా హమీదాను కౌగిట్లో బంధించి ముద్దులిచ్చాడు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ఈ రొమాన్స్ కు మిగతా సభ్యులు కాసేపు ఏం జరుగుతుందో తెలియక తికమకపడిపోయారు.

Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

యాంక సింగ్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ ఆమెకు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ఆమె తండ్రితో చేసిన వీడియో బైట్‌, ఆమె తమ్ముడు పంపించిన పసుపు కుంకుమ.. చీర.. గాజులను అందించాడు. ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉద్వేగభరితం సన్నివేశాలు కనిపించాయి. ఆ సమయంలోనే హమీదా కూడా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ ఏడ్చేయడంతో ఆమెని ఓదార్చాడు శ్రీరామ్. అప్పుడు కూడా హమీదాకు ముద్దులు పెట్టి అందరికీ షాక్ ఇచ్చేశాడు. ఇది ఓదార్పో.. లేక మరెంతో ఇంటి సభ్యులకు అర్ధంకాక తలపట్టుకున్నారు. శ్రీరామ్ ఓదార్పుకు హమీదా ప్రతిస్పందనలు ఈ షోలో మరింత విశేషం.