Trivikram Srinivas : ప్రతి నెల ఐదువేలు అద్దె కడుతున్న “త్రివిక్రమ్”.. ఎందుకో తెలుసా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో పంజాగుట్టలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఇల్లు అతడికి కలిసిరావడంతో ఇప్పటికి దానికి అద్దె చెల్లిస్తున్నారు.

Trivikram Srinivas : ప్రతి నెల ఐదువేలు అద్దె కడుతున్న “త్రివిక్రమ్”.. ఎందుకో తెలుసా?

Trivikram Srinivas

Trivikram Srinivas : కొందరు ఎంతెత్తుకు ఎదిగినా తమకు సాయం చేసిన వారిని తమకు కలిసొచ్చిన ఇంటిని వదులుకోరు. దేశ విదేశాల్లో సెటిల్ అయినా తమకు కలిసొచ్చిన వస్తువు, ప్రాంతం లేదా ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే చేస్తున్నారు. తనకు ఎంతగానో కలిసివచ్చిన ఇంటికి ఇప్పటికి అద్దె చెల్లిస్తున్నారు. నెలకు ఐదువేల రూపాయలు ఓనర్ అకౌంట్ లో వేస్తున్నారు.

ఆశలు ఈ ఇల్లు కథేంటి?

త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు.. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన వీరు పంజాగుట్టలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోని ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నసమయంలోనే ఇద్దరికి అవకాశాలు వచ్చాయి. త్రివిక్రమ్ రైటర్ గా కెరియర్ ప్రారంభించి దర్శకుడిగా మారగా.. సునీల్ కమెడియన్ నుంచి హీరోగా ఎదిగారు. కొంచం పేరు, డబ్బు వచ్చాకా, ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లారు. అయితే ఆ ఇంటికి మాత్రం ప్రతి నెల అద్దె చెల్లిస్తూ వస్తున్నారు.

త్రివిక్రమ్ ఈ ఇంటి గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. తమకు కలిసొచ్చిన ఇంట్లో కూర్చుని తన సినిమాలకు కథలు, మాటలు రాస్తుంటారు. ఈ ఇంట్లో కూర్చుంటే కథలు రాయడం ఎంతో సులభంగా ఉంటుందని, అందుకే ఆ ఇంటికి ఇప్పటికే అద్దె చెల్లిస్తూ అక్కడే సినిమా కథలు రాస్తారని తెలియజేశారు.