SRK Jawan: షారుక్ ‘జవాన్’లో అల్లు అర్జున్ ప్లేస్‌లో ఆ హీరో..?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవల ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో షారుక్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌కు తాను బాద్‌షా అని నిరూపించాడు. ఈ సినిమాలో ఆయన తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేశాడు. అటు కలెక్షన్ల పరంగానూ బాలీవుడ్‌కు బూస్ట్ ఇస్తూ ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లతో వావ్ అనిపించాడు పఠాన్.

SRK Jawan: షారుక్ ‘జవాన్’లో అల్లు అర్జున్ ప్లేస్‌లో ఆ హీరో..?

SRK Jawan To Replace Sanjay Dutt In Place Of Allu Arjun

SRK Jawan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవల ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో షారుక్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌కు తాను బాద్‌షా అని నిరూపించాడు. ఈ సినిమాలో ఆయన తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేశాడు. అటు కలెక్షన్ల పరంగానూ బాలీవుడ్‌కు బూస్ట్ ఇస్తూ ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లతో వావ్ అనిపించాడు పఠాన్.

Jawan : జవాన్‌ని పోస్ట్‌పోన్ చేయబోతున్న షారుఖ్.. కారణం అదేనా?

ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు షారుక్. దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ‘జవాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్నట్లు ఓ వార్త ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొట్టింది. కానీ, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కనబెడితే, ఈ సినిమాలో బన్నీ నటిస్తున్నాడనే వార్తతో జవాన్ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Jawan : షారుఖ్ జవాన్ కథ నాదే అంటూ.. తమిళ నిర్మాత మండలిలో డైరెక్టర్ అట్లీపై ఫిర్యాదు..

కానీ, తాజాగా ఈ సినిమాలో బన్నీ ప్లేస్‌లో వేరొక స్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టడంతో, జవాన్ సినిమాపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదట. దీంతో జవాన్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ చేయాల్సిన పాత్రలో సంజయ్ దత్‌ను తీసుకుందట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి వంటి వర్సటైల్ యాక్టర్స్ కూడా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.