shruti hassan : అభిమానులతో చిట్ చాట్.. అలాంటి వాళ్ళని చూస్తే కోపంగా ఉంటుంది

సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఈ స్టార్ డాటర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ పేజీలో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది.

shruti hassan : అభిమానులతో చిట్ చాట్.. అలాంటి వాళ్ళని చూస్తే కోపంగా ఉంటుంది

Sruthi Hassan

Sruthi Hassan :  కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన మార్క్ తో హిట్స్ కొట్టి అన్ని భాషల్లోనూ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది శృతి హాసన్. ఒక పక్క తన మ్యూజిక్ ఆల్బమ్స్ తో మరో పక్క సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకి ఓకే చెప్పింది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఈ స్టార్ డాటర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ పేజీలో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పింది.

Tollywood Gossips: రూమర్స్‌ను నిజం చేస్తున్న మేకర్స్..!

నిన్న ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శృతిహాసన్ అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఇందులో ఓ అభిమాని ‘మీ వయసెంతో తెలుసుకోవచ్చా’ అని అడిగితే.. ఇది చాలా సులభమైన ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పనవసరం లేదు. గూగుల్‌ చేస్తే తెలిసిపోతుందని సమాధానం ఇచ్చింది.
ఇక మరో నెటిజన్ పెళ్లి గురించి అడగడంతో.. తన పెళ్లి గురించి ఎవరూ ఆరా తీయొద్దని, అలాంటి విషయాలు అడిగితే నేను చాట్ చేయకుండా వెళ్లిపోతానని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
మీ సెలబ్రిటీ స్టేటస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడుగగా.. సినీ సెలబ్రిటీ అనే గర్వం తనకు ఎప్పుడూ లేదని, నేనే స్వయంగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకుల్ని తెచ్చుకుంటానని తెలిపింది.
ఇక ఓ అభిమాని ఫేవరేట్ ఫుడ్ గురించి అడగగా.. ఆహారంలో తనకు దక్షిణాది పచ్చళ్లు అంటే చాలా ఇష్టమని చెప్పింది.
మీకు ఎలాంటి వాళ్ళు నచ్చరు అని అడుగగా.. అబద్ధాలు చెప్పేవాళ్లను తాను ఆసహ్యించుకుంటానని, అలాగే సాటి స్త్రీకి ఏ విషయంలోనూ మద్దతుగా రాని స్త్రీలను చూస్తే కోపంగా ఉంటుందని చెప్పింది.

Mega Movies : మెగా సందడి.. మూడు నెలలు.. ఆరు సినిమాలు..

ఇక చివరగా ఇతరుల కోసం మన అభిప్రాయాల్ని మార్చుకోవద్దని, మంచి కోసం, నమ్మిన విలువల కోసం చివరిదాకా నిలబడాలని తన అభిమానులకి చెప్పింది.