SSMB28: ‘అమరావతికి అటు ఇటు’గా తిరుగుతున్న మహేష్.. ఇదే ఫిక్స్ అవుతుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

SSMB28 Movie To Have This Title
SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఈ పవర్ఫుల్ కాంబో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అదిరిపోయే సినిమాలు రావడంతో, ఈసారి వాటిని మించిన మూవీ వస్తుందని అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ వచ్చేది అప్పుడేనా.. నెట్టింట జోరందుకున్న టాక్!
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ ఎంటర్టైనర్గా మలుస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఈ కాంబో రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాకు త్రివిక్రమ్ మరోసారి తన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు అ అనే అక్షరంతో వచ్చే టైటిల్‌ని పెట్టేందుకే త్రివిక్రమ్ ఆసక్తి చూపుతున్నాడట.
గతంలో ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథకు యాప్ట్ అయ్యే విధంగా ఈ టైటిల్ ఉంటుందని తెలుస్తోంది.
SSMB28: మహేష్ సినిమాలో జయరామ్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!
మరి నిజంగానే ఈ సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా.. లేక మరొక టైటిల్‌ను పెడతారా అనేది చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.