SSMB28: మహేష్-త్రివిక్రమ్ నెక్ట్స్ అప్డేట్కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ బిగ్ అప్డేట్ను మే 31న రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

SSMB28 Next Big Update On May 31
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో మహేష్ లుక్ పరంగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో మాస్ స్వాగ్తో దుమ్ములేపాడు మహేష్. ఈ పోస్టర్ రిలీజ్‌తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు త్రివిక్రమ్.
SSMB28: సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్.. మాస్ ఎంట్రీతో రిలీజ్ డేట్ లాక్ చేశాడుగా!
అయితే, ఈ సినిమా నుండి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ బిగ్ అప్డేట్ను మే 31న రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మహేష్-త్రివిక్రమ్ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని.. అప్పటివరకు ప్రేక్షకులు వెయిట్ చేయాలని చిత్ర యూనిట్ కోరింది.
SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ వచ్చేది అప్పుడేనా.. నెట్టింట జోరందుకున్న టాక్!
ఇక మహేష్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోండగా, మరో బ్యూటీ శ్రీలీల కూడా ఈ సినిమాలో నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
We are glad that all Super Fans are happy with Fantastic #SSMB28 update?! 🤩
The next Hyper Massy update will be coming out in May, on the eve of Superstar Krishna gari Birthday ❤️
Until then, we hope you’ll wait patiently. 😜
— Naga Vamsi (@vamsi84) March 27, 2023